వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లీ-బిడ్డా క్షేమం: నిండు గర్భిణీని మోసుకెళ్లిన పోలీసు అధికారి, ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

మధుర: ప్రసవ వేధన పడుతున్న నిండు గర్భిణిని ఓ పోలీసు అధికారి చేతుల్లో మోసుకెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో జరిగింది. సదరు పోలీసు అధికారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని సదరు అధికారి అమాంతం తన చేతుల్లో ఆసుపత్రిలోకి మోసుకెళ్లాడు. ఆయన సరైన సమయంలో వారిని తీసుకెళ్లడంతో ఆమె, కొత్తగా పుట్టిన పసిపాప క్షేమంగా ఉన్నారు.

Mathura policeman carries pregnant woman to hospital, saves mother and newborn

ఈ సంఘటన సెప్టెంబర్ 14వ తేదీన జరిగింది. ఆ పోలీసు అధికారి పేరు సోను కుమార్. ఇతను మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

అతను కోర్టుకు వెళ్తుండగా ఓ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండటాన్ని గమనించారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ అది త్వరగా రాలేదు. దీంతో అతను వెంటనే ఆ మహిళను ఈ-రిక్షాలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోకి మోసుకెళ్లారు.

దీనిపై కుమార్ మాట్లాడుతూ... తాను ఆ మహిళను చూసి, సహాయం కోసం అంబులెన్స్‌కు ఫోన్ చేశానని, కాని అది అందుబాటులోకి రాలేదని, ఇక చేసేది లేక నిండు గర్భిణ్ని ఆసుపత్రిలోకి మోసుకెళ్లానని చెప్పారు. ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

English summary
A policeman in Mathura, Uttar Pradesh, saved the life of a pregnant lady and her child after he carried her in his arms to the hospital when the ambulance failed to reach the woman. The picture of the incident has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X