వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా మీరే చేశారు : యూపీలో ఓటమిపై అఖిలేశ్‌పై బెహన్ జీ గుస్సా ..

|
Google Oneindia TeluguNews

లక్నో : ఎన్నికలు ముగిసి .. ఫలితాలొచ్చి ప్రభుత్వం కొలువుదీరింది. తన టీంలోని వారికి పోర్టుపోలియో కూడా కేటాయించారు మోడీ. ఇక యూపీలో కలిసి పోటీచేసిన బీఎస్పీ-ఎస్పీలు తమ ఓటమిని అంగీకరించాయి. కానీ ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. ఇక బెహన్ జీ మాయావతి ఆ లోటును పూడ్చివేశారు. తన భాగస్వామ్య పక్షం ఎస్పీపై విమర్శలు కురిపించారు.

నో ఎఫెక్ట్ ..
యూపీ కోటాలో ఎస్పీ-బీఎస్పీ ప్రభావం చూపలేదు. ఇక్కడ మెజార్టీ సీట్లు కేంద్రంలో చక్రం తిప్పుదామని మాయావతి, అఖిలేవ్ భావించారు. కానీ ప్రజలు అనుహ్య తీర్పునివ్వడంతో మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభావం చూపలేదని మాయావతి అంగీకరించారు. ఇవాళ లక్నోలో బీఎస్పీ ఆఫీస్ బేరర్లలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన భాగస్వామ్య పక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను విమర్శించారు మాయావతి. ఎన్నికల్లో యాదవుల ఓట్లు చీలిపోయాయనా .. చీలికను ఆపడంలో అఖిలేశ్ విఫలమయ్యారని మండిపడ్డారు. దీనికి కార్యకర్తలకు ఉదహరణ కూడా చెప్పారు. తన భార్య డింపుల్ యాదవ్ కనౌజ్‌లో 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. యాదవుల ఓట్లను చీల్చి ఉంటే ఆమె విజయం తథ్యమయ్యేదని గుర్తుచేశారు.

Mayawati blames Akhilesh Yadav for Uttar Pradesh poll

అఖిలేశ్ వల్లే ..
యూపీలో కూటమితో అసంతృప్తితో ఉన్నానని పేర్కొన్నారు మాయావతి. రాష్ట్రంలో ఎస్పీ చేసిన చర్యలతో ఓటు బ్యాంకు పడిపోయిందని .. ఈ క్రమంలో తాము కూటమి నుంచి వైదొలుగుతామని సంకేతాలు ఇచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి .. తమ సత్తా చాటుదామని శ్రేణులను ఉత్తేజపరిచినట్టు తెలసింది. అంతేకాదు ఎన్నికల్లో ఆశాజనక ఫలితం చూపని తమ పార్టీకి చెందిన నేతలపై ఇదివరకే మాయావతి వేటు వేశారు. రెండు రాష్ట్రాల బీఎస్పీ అధ్యక్షులను, ఉత్తరాఖండ్, బీహర్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల కో ఆర్డినేటరన్లు తొలగించారు. ఎన్నికల్లో ఘోర పరజయానికి మాత్రం ఎస్పీ కారణమని దుమ్మెత్తిపోశారు మాయావతి. ఇక్కడ బీఎస్పీ 10 సీట్లు గెలిస్తే .. ఎస్పీ 15 వరకు గెలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ 62 సీట్లు గెలిచి తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే.

English summary
bahujan Samaj Party (BSP) chief on Monday blamed gathbandhan (alliance) with Samajwadi Party (SP) for Uttar Pradesh election loss saying the gathbandhan was not able to yield desired results. Mayawati, who held a review meeting with office bearers and senior leaders of the BSP blamed Akhilesh Yadav for not being able to stop the division of Yadav votes during Lok Sabha election 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X