వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయా ఇదీ తగదు : మోదీపై వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీజేపీలో మహిళ నేతల భర్తలు మోదీని కలువడంతో .. ఎక్కడ తన భర్తలు తమను వీడిపోతారనే మాయావతి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ స్పందించారు. మాయావతి విమర్శలు దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తమ పార్టీలో మహిళ నేతలంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. లేనిది ఊహించుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

అభద్రతాభావం లేదు ..
బీజేపీలో మహిళ నేతలంతా పూర్తి సురక్షితంగా, ఎలాంటి అభద్రతాభావం లేకుండా ఉన్నారని ఉద్గాటించారు నిర్మలా. తమ గురించి మాయావతి బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. మోదీ, ఆయన వ్యక్తిగత జీవితం, బీజేపీ మహిళా నేతలపై మాయవతి వ్యాఖ్యలను ఖండించారు. దళితుల జాబితాలో తాను ఒక్కరే ఉన్నానని మాయావతి అనుకుంటున్నారా నిర్మలా ప్రశ్నించారు. వాస్తవానికి మాయావతి మాట్లాడేది దళితుల గురించేనా అని నిలదీశారు. నిజానికి మాయావతి అభ్రదతాభావంతో ఉన్నారని స్పష్టంచేశారు. అందుకోసమే లేనిది ఉన్నట్టు ఊహించుకొని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితనేతగా వారి హక్కుల కోసం పోరాడాల్సింది పోయి .. కాంగ్రెస్ తో జట్టుకట్టడం బీఎస్పీ నైజం ఏంటో అర్థమవుతోందన్నారు.

Mayawati defamed PM Narendra Modi, woman leaders of BJP: Nirmala

దళిత బాలిక రేప్ ఘటనతో ...
రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత బాలిక రేప్ పై మాయావతి మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. దీంతో బెహన్ జీ ధీటుగా స్పందించారు. బీజేపీలోని మహిళ నేతల భర్తలు మోదీని కలుస్తున్నారంటే .. ఆ మహిళలు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. మోదీ లాగా తమ భర్తలు కూడా వదిలేస్తారెమోనని భయం ఉందని కామెంట్ చేశారు. దీంతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ... ధీటుగా కౌంటర్ చేశారు. అంతేకాదు మోదీపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ లో దళిత బాలికపై అఘాయిత్యం జరిగిన ... దళిత్ కార్డు చూపే మాయావతి స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా కొనసాగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దీనిని దళితులు గమనిస్తున్నారని ... మీ వైఖరి ఇదేనా అని కొశ్చన్ చేశారు నిర్మలా సీతారామన్.

English summary
Defence Minister Nirmala Sitharaman on Monday hit out at BSP chief Mayawati for 'defaming' PM Modi and the women leaders of BJP instead of explaining why she has not withdrawn her support for the Rajasthan government over the Alwar gangrape case. Sitharaman was speaking at a press conference. Nirmala Sitharaman said the BJP has demanded an apology from Mayawati for statements she made against PM Narendra Modi. "PM rightly asked Mayawati if she will extend her support to the Dalit woman in Rajasthan whose case also hasn't been recovered under the Congress government, she should have answered but she decided to defame our PM and women of BJP," Sitharaman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X