వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతికి బిఎస్‌పి మాజీ ఎంపి సిద్దిఖీ షాక్: ఓటు బ్యాంకుకు చెక్

అసెంబ్లీ ఎన్నికల నుండి బిఎస్‌పి చీఫ్ మాయావతి వరుసగా ఎదురుదెబ్బలను తింటున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయం పాలైంది. అయితే రాజ్యసభలో దళితుల సమస్యపై మాట్లాకుండా అడ్డుకొన్నందుకు నిరసనగా ఆమె తన రాజ్యస

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నుండి బిఎస్‌పి చీఫ్ మాయావతి వరుసగా ఎదురుదెబ్బలను తింటున్నారు.
ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయం పాలైంది. అయితే రాజ్యసభలో దళితుల సమస్యపై మాట్లాకుండా అడ్డుకొన్నందుకు నిరసనగా ఆమె తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.అయితే బిఎస్‌పి మాజీ నేత సిద్దిఖీ రూపంలో మాయావతికి షాక్ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్‌పి చీఫ్ మాయావతికి మరోమారు గట్టిషాక్ తప్పదా అనే చర్చలు ప్రారంభమయ్యాయి.ఈమెపై దళిత సంస్థలే బహిష్కరణ అస్త్రం వేటేసేలా వ్యూహరచన సాగుతోందని రాజకీయవిశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

 Mayawati faces threat from core support group: BJP in for another good news?

ఆదివారం నాడు బిఎస్‌పి నుండి బహిష్కరణకు గురైన నసీముద్దీన్ సిద్దిఖీ దళితులు, ఓబిసి, ముస్లింవర్గాలకు చెందిన 16 సంస్థలతో ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో మాయావతికి సిద్దిఖీ సన్నిహితంగా ఉండేవారు.

బిఎస్‌పి నుండి బహిష్కరణకు గురైన తర్వాత నేషనల్ బహుజన్ అలయన్స్ పేరిట సిద్దిఖీ స్వంత కుంపటి ఏర్పాటుచేసుకొన్నారు. ఈ కమిటీకి మాజీ బిఎస్‌పి ఎంపీ ప్రమోద్ కురీల్ కన్వీనర్‌గా, కోర్డినేషన్ కమిటీని కూడ సిద్దిఖీ స్థాపించారు.

అయితే సిద్దిఖీ ఇప్పటికీ బిఎస్‌పిలోనే ఉన్నారని, మాయావతిని బహిష్కరించి తమ నాయకుడిగా బాధ్యతలు చేపడుతారంటూ ప్రమోద్ కురీలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనానికి కారణమయ్యాయి. బిఎస్‌పి నుండి సిద్దిఖీని మాయావతి బహిష్కరించిన సమయంలో కొందరు బిఎస్‌పి ఎమ్మెల్యేలు మాయావతిని బహిష్కరించేందుకు సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే బిజెపి నాయకత్వంతో కూడ సిద్దిఖీ చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో సమావేశం తర్వాత వివిధ రాష్ట్రాల నుండి 16 రాజకీయ, రాజకీయేతర సంస్థలు ఒకే వేదికపై సమావేశమైన విషయాన్ని సిద్దిఖీ గుర్తుచేశారు.

త్వరలో కమిటీ మళ్ళీ సమావేశం నిర్వహించనున్నారు. మేమంతా ఉమ్మడిగా వచ్చే ఉపఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. పార్టీ నుండి బయటకు వెళ్ళినవారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సిద్దికీ చెప్పారు. మళ్ళీ బహుజన సమాజానికి గుర్తింపుతో పాటు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తామని సిద్దిఖీ ప్రకటించారు.

English summary
several outfits of Dalits, OBCs and Muslims (16 of them to be precise) led by former leaders of the Bahujan Samaj Party (BSP) held a meeting in Delhi on Sunday, August 6, to come up with a strategy to knock out the former chief minister of UP and jeopardise her "Bahujan" vote-bank.These outfits were brought together by the BSP supremo's former aide Naseemuddin Siddique and they formed a National Bahujan Alliance along with a coordination committee with former BSP MP Pramod Kuree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X