వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహాలు పెట్టినందుకు డబ్బు డిపాజిట్ చేయాల్సిందే: మాయావతికి సుప్రీం కోర్టు షాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రజాధనం ఉపయోగించి తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నందుకు గాను బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి డబ్బులు తిరిగి చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేసాలు జారీ చేసింది. ప్రజాధనం ఖర్చు పెట్టడంపై ఆమెకు భారత అత్యున్నత న్యాయస్థానంలోనే గట్టి షాక్ తగిలింది.

మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఎస్పీ పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని యూపీకి చెందిన ఓ లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Mayawati has to deposit money used for erecting her statues, BSP symbols elephant: Supreme Court

ఈ నేపథ్యంలో శుక్రవారం పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రజాధనాన్ని ఉపయోగించి మాయవతి తన పార్టీ గుర్తు, తన విగ్రహాలను ఆవిష్కరించారని, కాబట్టి రాష్ట్ర ఖజానాలో ఈ సొమ్ము జమ చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్‌ గొగోయ్‌ తెలిపారు. ఇది తాత్కాలిక అభిప్రాయమని, దీనిపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. ఏప్రిల్‌ 2న ఈ కేసు తుది విచారణ జరుగనుందని దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

English summary
The Supreme Court Friday said it was of the tentative view that BSP chief Mayawati has to deposit public money used for erecting statues of herself and elephants, the party's symbol, at parks in Lucknow and Noida to the state exchequer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X