వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాండ్ మార్చిన మాయావతి?: కర్ణాటకలో బీజేపీకి పెద్ద దెబ్బే!..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీఎస్పీ అధినేత్రి మాయావతి తన మైండ్ సెట్ మార్చుకున్నారా?.. కర్ణాటక ఎన్నికలవేళ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె.. ఆపై ఎందుకు సైలెంట్ అయిపోయారు?. కర్ణాటక వ్యాప్తంగా ఇప్పుడు దీని పైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయినా సరే, కొన్ని సీట్లు అయినా గెలుచుకుని ప్రభావం చూపించాలని జేడీఎస్, బీఎస్పీలు భావించాయి. అయితే మారిన సమీకరణాల రీత్యా మాయావతి ఆలోచన కూడా మారినట్టు తెలుస్తోంది.

స్టాండ్ మార్చిన మాయావతి:

స్టాండ్ మార్చిన మాయావతి:

జేడీఎస్ బీజేపీకి అనుకూలం అన్న వాదనలు వినిపిస్తుండటం.. దళిత ఓటు చీలిపోతే అది పరోక్షంగా బీజేపీకి మేలు చేసేదిగా మారే అవకాశం ఉండటంతో.. మాయావతి పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. అందుకే ఎన్నికలు సమీపిస్తున్నా.. ఆమె మాత్రం ప్రచార ర్యాలీల్లో ఎక్కడా కనిపించట్లేదు.

మాయావతి యూటర్న్ వెనుక

మాయావతి యూటర్న్ వెనుక

మాయావతి మాత్రమే కాదు, కర్ణాటకలోని బీఎస్పీ అభ్యర్థులు కూడా ఇంకా ప్రచార పర్వం మొదలుపెట్టనే లేదు. అధినేత్రి సూచన మేరకే వారు సైలెంట్ అయిపోయారన్న వాదన ఉంది. బీఎస్పీ గనుక బరిలో దిగకుంటే.. యాంటీ బీజేపీ దళిత ఓటు కాంగ్రెస్ పార్టీకే పోలై ఉండేది. అది బీజేపీకి పెద్ద డ్యామేజ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కానీ జేడీఎస్‌తో పొత్తుతో బీఎస్పీ రంగంలోకి దిగడంతో బీజేపీ సైతం ఆనందపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప కూడా ఓ సమావేశంలో ఇదే చెప్పారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం దీనిపై విచారం వ్యక్తం చేశారు. దళిత ఓటును చీల్చడం ద్వారా మాయావతి పరోక్షంగా బీజేపీకి సహాయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

 కాంగ్రెస్ బహిరంగ ఆరోపణలు

కాంగ్రెస్ బహిరంగ ఆరోపణలు


కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జీ కేసీ వేణుగోపాల్ ఈ విషయంలో మాయావతిపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. మాయావతి బీజేపీకి 'బి'టీమ్ లాంటిదని ఆరోపించారు. బహుశా ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకునే మాయావతి కర్ణాటక ఎన్నికలపై అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

అందుకే.. పొత్తు సమయంలో జేడీఎస్‌తో కనిపించిన ఆమె రెండు నెలలు గడుస్తున్నా.. మళ్లీ ఏ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి కర్ణాటకలో డజనుకు పైగా ప్రచార ర్యాలీల్లో పాల్గొంటానని మాయావతి మాట ఇచ్చారు కూడా.

బీజేపీకి లాభం చేయకూడదనే..

బీజేపీకి లాభం చేయకూడదనే..

మాయావతి మౌనంతో జేడీఎస్ కూడా బీఎస్పీ గురించి ఏమి మాట్లాడటం లేదు. 'ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ పొత్తు బలపడుతున్నవేళ.. అనవసరంగా జేడీఎస్ కు మళ్లీ ప్రాచుర్యం
కల్పించడం ఎందుకు అని మాయావతి భావిస్తున్నారు. యాంటీ బీజేపీ దళిత ఓటు జేడీఎస్ కు పోలైతే.. అది పరోక్షంగా బీజేపీకే లాభమని ఆమె గ్రహించారు. అందుకే ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటున్నారు' అని ప్రొఫెసర్ నరసింహప్ప అభిప్రాయపడ్డారు.

నరసింహప్ప ఒకప్పటి మాజీ ప్రధాని, జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు అయిన చరణ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు.

పొత్తుపై సందిగ్ధం?

పొత్తుపై సందిగ్ధం?

జేడీఎస్ తో పొత్తుపై స్పందించడానికి రాష్ట్ర బీఎస్పీ నాయకులు కూడా అంత సుముఖంగా లేరు. అసలు ఈ పొత్తు ఉంటుందో ఊడుతుందో తెలియదని కొంతమంది నాయకులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అధినేత్రి నుంచి మాత్రం ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన సంకేతాలు రాలేదని తెలుస్తోంది. మరో బీఎస్పీ నేత మాట్లాడుతూ.. ఒకవేళ కర్ణాటక ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంభించాలని మాయావతి గనుక నిర్ణయం తీసుకుంటే.. దానికంటే తెలివైన నిర్ణయం ఇంకొకటి లేదని అభిప్రాయపడ్డారు.

అసదుద్దీన్, శరద్ పవార్ కూడా

అసదుద్దీన్, శరద్ పవార్ కూడా


మాయావతి ఒక్కరే కాదు, జేడీఎస్ తో తొలుత బాగానే సంప్రదింపులు జరిపిన ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నేషనల్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని ఉత్తర కర్ణాటకలో దాదాపు 50సీట్లలో పోటీ చేయాలని ఓవైసీ భావించినట్టుగా కర్ణాటక వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయమై జేడీఎస్ చీఫ్ దేవె గౌడతోను ఆయన సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి దేవె గౌడ నిరాకరించినట్టు సమాచారం. ఆ తర్వాత అసదుద్దీన్ సైలెంట్ అయిపోయారు. సర్దుబాటు చేసుకుని పోటీ చేసినా.. ముస్లిం ఓటును చీల్చడం కూడా బీజేపీకే లాభిస్తుందని ఆయన భావించినట్టు తెలుస్తోంది.

ఇక ఎన్సీపీకి జేడీఎస్ ఏడు సీట్లు ఆఫర్ చేసినప్పటికీ.. పవార్ అంత సుముఖత వ్యక్తం చేయలేదు. ఇది పరోక్షంగా బీజేపీకి మేలు చేయడమే అని ఆయన ముందే గ్రహించి కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

బీజేపీకి ఆశాభంగం?

బీజేపీకి ఆశాభంగం?


మొత్తం మీద నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఓట్లను జేడీఎస్ చీల్చడం ద్వారా లబ్ది పొందాలని భావించిన బీజేపీకి.. మాయావతి యూటర్న్ తీసుకోవడం వారి ఆశలకు గండి కొట్టేదిగా మారింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కాగా, జేడీఎస్ తో పొత్తులో భాగంగా బీఎస్పీకి ఆ పార్టీ 21సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

English summary
In a surprise move, BSP supremo Mayawati had joined hands with former Prime Minister H D Deve Gowda’s JDS for Assembly polls two months ago. Together they addressed a huge public meeting in Bengaluru and Gowda offered her 21 seats out of 224 seats in the state. Mayawati had thundered that she would be defeating the Congress and the BJP in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X