• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Revenge: హైప్రొఫైల్ లీడర్, మేయర్ ను కాల్చి చంపిన షార్ప్ షూటర్స్, సినిమా స్టైల్లో, ఇంటి పక్కనే !

|

పాట్నా/బీహార్/చెన్నై: హైప్రొఫైల్ రాజకీయ నాయకుడి మీద ప్రత్యర్థులు పగ పెంచుకున్నారు. మేయర్ గా ఉన్న ఆ నాయకుడిని ఎలాగైనా చంపేయాలని ప్రత్యర్థులు డిసైడ్ అయ్యారు. మేయర్ ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అంటూ రెక్కీ నిర్వహించారు. సమయం చూసి మేయర్ ను లేపాయలని స్కెచ్ వేసిన ప్రత్యర్థులు షార్ప్ షూటర్స్ ను రంగంలోకి దింపారు. ఒకరి గురి తప్పినా మరోకరి గురి తప్పకూడదని ప్లాన్ వేశారు. మీటింగ్ ముగించుకుని ఇంటి సమీపంలో వెలుతున్న మేయర్ మీద షార్ప్ షూటర్ విరుచుకుపడటంతో ఆ రాజకీయ నాయకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీస్ స్టేషన్ కుసమీపంలో, ఇంటి పక్కనే మేయర్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !

 మేయర్ మీద పగ

మేయర్ మీద పగ

బీహార్ లోని కథిహార్ నగరం మేయర్ గా శివరాజ్ పాశ్వాన్ హైప్రొ ఫైల్ రాజకీయ నాయకుడు. మేయర్ గా పని చేస్తున్న శివరాజ్ పాశ్వాన్ తో రాజకీయంగా కొందరితో విభేదాలు ఉన్నాయి. హైప్రొఫైల్ రాజకీయ నాయకుడైన శివరాజ్ పాశ్వాన్ మీద ప్రత్యర్థులు పగ పెంచుకున్నారు. మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను ఎలాగైన చంపేయాలని ప్రత్యర్థులు డిసైడ్ అయ్యారు.

 రెక్కీ..... రంగంలోకి షార్ప్ షూటర్స్

రెక్కీ..... రంగంలోకి షార్ప్ షూటర్స్

కాథిహార్ మేయర్ శివరాజ్ పాశ్వాన్ ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నాడు, ఆయన ఎవరిని కలుస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అంటూ రెక్కీ నిర్వహించారు. సమయం చూసి మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను లేపాయలని స్కెచ్ వేసిన ఆ నాయకుడి ప్రత్యర్థులు షార్ప్ షూటర్స్ ను రంగంలోకి దింపారు. ఒకరి గురి తప్పినా మరోకరి గురి తప్పకూడదని సినిమా స్టైల్లో ప్లాన్ వేశారు.

మీటింగ్ నుంచి ఇంటి బయలుదేరిన మేయర్

మీటింగ్ నుంచి ఇంటి బయలుదేరిన మేయర్

గురువారం రాత్రి 8 గంటల సమయంలో మేయర్ శివరాజ్ పాశ్వాన్ ఓ సమావేశానికి హాజరైనారు. రాత్రి 9.30 గంటలకు మీటింగ్ ముగించుకున్న శివరాజ్ పాశ్వాన్ బైక్ లో ఇంటికి బయలుదేరాడు. రోజు కారులో తిరుగుతున్న మేయర్ శివరాజ్ పాశ్వాన్ గురువారం రాత్రి బైక్ లో సంతోషి చౌక్ సమీపంలోని ఇంటికి బయలుదేరాడంతో ప్రత్యర్థులు ఆయన్ను ఫాలో అయ్యారు.

రివాల్వర్ తో కాల్చిన షార్ప్ షూటర్స్

రివాల్వర్ తో కాల్చిన షార్ప్ షూటర్స్

కథిహార్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో, సంతోషి చౌక్ లోని సొంత ఇంటికి సమీపంలో వెలుతున్న మేయర్ శివరాజ్ పాశ్వాన్ తో సుమారు 38 సంవత్సరాల వ్యక్తి మాట్లాడటానికి ప్రయత్నించాడు. అదే సమయంలో షార్ప్ షూటర్స్ మేయర్ శివరాజ్ పాశ్వాన్ మీద రివాల్వర్ తో కాల్పులు జరిపారు. బుల్లెట్లు దూసుకుపోవడంతో మేయర్ శివరాజ్ పాశ్వాన్ కుప్పకూలిపోయాడు.

 సినిమా స్టైల్లో పక్కాప్లాన్ తో హత్య

సినిమా స్టైల్లో పక్కాప్లాన్ తో హత్య

మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను వెంటనే కథిహార్ మెడికాల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మేయర్ శివరాజ్ పాశ్వాన్ ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. గురువారం రాత్రి 9.30 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో శివరాజ్ పాశ్వాను కాల్చి చంపారని సదార్ సీనియర్ పోలీసు అధికారి అమర్ కాంత్ జా మీడియాకు చెప్పారు.

 జిల్లా సరిహద్దులు క్లోజ్

జిల్లా సరిహద్దులు క్లోజ్

మేయర్ శివరాజ్ పాశ్వాన్ మద్దతుదారులు గుమికూడటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను హత్య చేసిన నిందితులు పారిపోకుండా జిల్లా సరిహద్దులు మూసివేసిన పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయితే మేయర్ శివరాజ్ పాశ్వన్ హత్య కేసులో ఇంత వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు అంటున్నారు. బీహార్ లో మరో హైప్రొఫైల్ రాజకీయ నాయకుడు హత్యకు గురికావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
Revenge: The mayor of Katihar, Bihar, was allegedly shot dead by unidentified assailants on Thursday night. The accused allegedly approached the 38-year-old man at around 9.30 - 9.45 pm, when he was returning home after attending a meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X