వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నుకొట్టిన మేయర్ కుమారుడు.. మహిళ కౌన్సిలర్ ఫిర్యాదు ... ఎక్కడో తెలుసా ..?

|
Google Oneindia TeluguNews

పాట్నా : అధికార కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులే పాల్గొనాలి. కుటుంబసభ్యులు .. భర్త, కుమారుడు సమావేశానికి హాజరుకాకుడదు. కానీ రిజర్వేషన్ల పుణ్యమా అని మహిళ ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తోన్న చోట భర్త లేదంటే కుమారుల హవా కొనసాగుతుంది. ఆ మహిళమణులు మాత్రం రబర్‌స్టాంప్‌గా మిగిలిపోతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో ఇలాంటి ఘటన జరుగుతున్నాయి. కానీ బీహర్‌లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. అంటే పుత్రరత్నం మంచి పనేం చేయలేదు. మహిళ ప్రతినిధిని వేధించి .. వార్తల్లో నిలిచాడు.

పుత్రరత్నం హవా ..

పుత్రరత్నం హవా ..

బీహర్ రాజధాని పాట్నా మున్సిపాలిటీకి మేయర్‌గా సీత సాహు పనిచేస్తున్నారు. ఆమెకు శిశిర్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి అన్నీ పనులు చక్కబెడుతుంటాడు. పాలానా వ్యవహారంలో జోక్యం కూడా చేసుకుంటాడు. అయితే ఇటీవల పాట్నాలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. మీటింగ్‌కు మున్సిపల్ మేయర్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొనాలి. సమావేశానికి మేయర్ కుమారులు, భర్తలు రాకూడదు. కానీ మేయర్ కుమారుడు శిశిర్ సమావేశానికి వచ్చాడు. అక్కడ అన్నీ విషయాలు మాట్లాడుతున్నారు. పట్టణ అభివృద్ధి కోసం ఏం చేద్దాం ? ఏ నిర్ణయాలు తీసుకుందాం అనే అంశాలపై విసృతంగా చర్చిస్తున్నారు.

వెకిలీ చేష్టలు ..

వెకిలీ చేష్టలు ..

సమావేశానికి హాజరైన 21 వార్డు కౌన్సిలర్ పింకీ కుమారీ తన వార్డులో ఉన్న ఇబ్బందులను చెపుతున్నారు. ఇంతలో కలుగజేసుకున్న మేయర్ కుమారుడు శిశిర్ వెకిలీ చేష్టలు చేశాడు. అక్కడే ఉన్న పింకీ కుమారీకి కన్నుకొట్టాడు. దీంతో ఆమె చాలా ఇబ్బందికి గురయ్యారు. అంతకుముందు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తుచేశారు పింకీ. వెంటనే ఈ విషయాన్ని శిశిర్ తల్లి, మేయర్‌ సీత దృష్టికి తీసుకెళ్లారు. తన కుమారుడు అనుచిత ప్రవర్తనను మేయర్ వెనకేసుకొచ్చారు. అబ్బే అదేం లేదని .. పింకీ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కవరింగ్ చేశారు. శిశిర్ ప్రవర్తనతో ఇబ్బందికి గురైన పింకీ .. మేయర్ కూడా తనకు జరిగిన అవమానం గురించి పట్టించుకోవడం లేదని ఫీలయ్యారు.

పనుల గురించి అడిగితే ..

పనుల గురించి అడిగితే ..

ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశానికి పింకీ కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో మున్సిపల్ పనులు, అభివృద్ధికి సంబంధించి పింకీ ప్రశ్నించారు. దీంతో తనపై అప్పటినుంచి పగ పెంచుకున్నారని పేర్కొన్నారు. దీంతో సమయం లభించినప్పుడల్లా తనను టార్గెట్ చేస్తున్నారని .. ఇవాళ తనకు శిశిర్ కన్నుకొట్టాడని పింకీ వాపోయారు. బోర్డు సమావేశంలో శిశిర్ కన్నుకొట్టడంతో పింకీ .. ధీటుగానే ప్రతిఘటించారు. దీంతో కౌన్సిల్ సమవేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ అంశాన్ని బీహర్ సీఎం నితీశ్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళతానని స్పష్టంచేశారు. తనతో అనుచితంగా ప్రవర్తించిన శిశిర్‌పై కడమ్‌కువ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఏం జరిగిందంటే .. శిశిర్ వివరణ

శిశిర్ ప్రవర్తనపై కౌన్సిలర్ పింకీ ఇలా ఆరోపణలు చేస్తే .. మేయర్ కుమారుడు కూడా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారం అని కొట్టిపారేశారు. ఇటీవల మున్సిపల్ శాశ్వత కమిటీల్లో పింకీని తొలగించామని గుర్తుచేశారు. దీంతో అప్పటినుంచి తమపై కోపం పెంచుకున్నారని చెప్పారు. అందుకే లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే తప్ప తాను పింకీతో అనుచితంగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేసిన పింకీపై పరువునష్టం దావా కేసు వేసే ఆలోచనలో ఉన్నానని మీడియాకు తెలిపారు.

English summary
a ward councillor in the Patna municipality has alleged that the son of Municipal Council Mayor was teasing her and winking at her during a board meeting. The accused Shishir Kumar was present at the meeting even though he is not part of the municipality. When ward councillor Pinki Kumari raised the matter with the Mayor Sita Sahu, she brushed off the allegations against her son and said that the woman was only seeking attention. Pinki Kumari is the ward councillor of ward number 21 of the Patna municipality. She has lodged a complaint with the Kadamkua police station against Shishir Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X