వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మృతి ఇరానీ ఇచ్చే డిగ్రీ నాకు అక్కర్లేదు: విద్యార్థి షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పర్యటనకు ముందే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ విద్యార్థి షాకిచ్చాడు. కేంద్రమంత్రి సోమవారం ఇస్లామిక్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు ప్రదానం చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నుంచి ఓ ఎంబీఏ విద్యార్థి పట్టా తీసుకోబోనని ఓ విద్యార్థి ప్రకటించాడు. స్మృతీ చేతుల మీదుగా ఇచ్చే డిగ్రీ తనకు అక్కర్లేదని అతను స్పష్టం చేశాడు. కాశ్మీర్‌లోని ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి బ్యాచ్‌లో సమీర్ గోజ్వారీ అనే యువకుడు ఎంబీఏ చదివి ఉత్తీర్ణుడయ్యాడు.

MBA pass out refuses to take degree from Smriti Irani

ఓ విద్యార్థిగా మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం కంటే ఆనందం ఇంకోటి ఉండదని, కానీ సోమవారం జరిగే స్నాతకోత్సవంలో ఇచ్చే ఆ పట్టా నాకు అక్కర్లేదని సమీర్ తెలిపాడు. ఈ కార్యక్రమానికి స్మృతీ హాజరవుతారా? లేదా? అన్న విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆమె సెంట్రల్ యూనివర్శిటీ కాశ్మీర్ కాంప్లెక్స్‌కు గండేర్బల్‌లో శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం నాడు జరిగే ఇస్లామిక్ వర్శిటీ తొలి స్నాతకోత్సవానికి ఓ కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా వస్తారని సమాచారం ఉండటంతో ఈ కార్యక్రమానికి కూడా స్మృతీ వస్తారని భావిస్తున్నారు.

English summary
After Sahitya Akademi row, student refuses to accept MBA degree from HRD Minister Smriti Irani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X