వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ గెలుపుతో రాజీనామాలు: ఎమ్మెల్యే పదవికి అల్కా, కాంగ్రెస్ పదవికి అజయ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుంధుభి మోగించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కీలక నేతల రాజీనామాల పర్వం మొదైలంది. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ ఓటమితో ఆ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.

కాగా, 'నా నియోజకవర్గంలోని మూడు వార్డుల్లో ఆప్‌ ఓటమి పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నాను' అని అల్కాలంబా ట్వీట్‌ చేశారు. అయితే కేజ్రీవాల్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని లంబా అన్నారు.

<strong>ఢిల్లీ మున్సిపల్‌ ఫలితాలు: బీజేపీ ఘన విజయం, పోటీ కూడా ఇవ్వని ఆప్, కాంగ్రెస్</strong>ఢిల్లీ మున్సిపల్‌ ఫలితాలు: బీజేపీ ఘన విజయం, పోటీ కూడా ఇవ్వని ఆప్, కాంగ్రెస్

అల్కాలంబా చాందీని చౌక్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు పార్టీలో ముఖ్యమైన పదవులేం లేకపోవడం గమనార్హం. గత సంవత్సరం ఆప్‌ అధికార ప్రతినిధుల ప్యానెల్‌ నుంచి లంబాను తొలగించడం జరిగింది.

MCD election results 2017: As AAP wilts, Alka Lamba offers to quit as MLA

అజయ్ మాకెన్ రాజీనామా

ఇది ఇలా ఉండగా, ఢిల్లీ నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపిన ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌... పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.

ఇకపై పార్టీలో సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తానని చెప్పారు. ఢిల్లీ నగర పాలక ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడిన విషయం తెలిసిందే. స్పష్టమైన ఆధిక్యంతో మూడు నగరపాలక సంస్థలను బీజేపీ కైవసం చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు నిలిచాయి.

English summary
Aam Aadmi Party MLA Alka Lamba on Wednesday offered to resign from her post and also relinquish all positions in the party taking “responsibility” for the defeat of AAP candidates in her constituency.
Read in English: Ajay Maken resigns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X