వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోగులతో ఆ సంబంధాలొద్దు

|
Google Oneindia TeluguNews

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. బిడ్డకు జన్మనిచ్చి తల్లి ప్రాణం పోస్తే.. ప్రాణాపాయంలో మనిషిని కాపాడే వ్యక్తి వైద్యుడు. అయితే కొందరు డాక్టర్ల ప్రవర్తన ఆ వృత్తికి మచ్చ తెస్తోంది. వైద్యం కోసం వచ్చిన రోగులతో లైంగిక సంబంధాల కోసం డాక్టర్లు వేధించడంపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఎంసీఐకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. పేషెంట్లు - డాకర్ల మధ్య సెక్సువల్ రిలేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించింది.

<strong>సెల్‌ఫోన్‌ వాడకానికి చెప్పు దెబ్బ..! ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్</strong>సెల్‌ఫోన్‌ వాడకానికి చెప్పు దెబ్బ..! ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్

లైంగిక సంబంధాలు వద్దన్న ఎంసీఐ

లైంగిక సంబంధాలు వద్దన్న ఎంసీఐ

వైద్యులకు రోగులతో లైంగిక సంబంధాలు ఉండకూడదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రూపొందించిన ఈ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలని ఆదేశించింది. వైద్య వృత్తిలో ఉన్నవారు పరస్పర అంగీకారం ఉన్నా లైంగిక సంబంధాల జోలికి వెళ్లకూడదని, అలాంటి చర్యలకు పాల్పడటం వైద్య నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది.

పరస్పర అంగీకారంతో చేసిన తప్పే

పరస్పర అంగీకారంతో చేసిన తప్పే

వైద్యులు, రోగికి మధ్య లైంగిక సంబంధం ఉంటే అది చికిత్సపై ప్రభావం చూపుతుందని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ స్పష్టం చేసింది. ఇది రోగికి నష్టం కలిగిస్తుందని చెప్పింది. ఒకవేళ రోగి తనంతట తాను అలాంటి సంబంధాన్ని కోరుకున్నా డాక్టర్లు దాన్ని తిరస్కరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ రోగి జననేంద్రియాలను పరీక్షించాల్సి వస్తే సదరు రోగి సహాయకుల సమక్షంలోనే జరపాలని సూచించింది. చికిత్స సమయంలోనే కాదు.. మాజీ రోగులతోనూ లైంగిక సంబంధాలు పెట్టుకోరాదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

హైకోర్టుకు అఫిడవిట్

హైకోర్టుకు అఫిడవిట్

రోగులతో సెక్సువల్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎంసీఐ గైడ్‌లైన్స్ జారీ చేయడం వెనుక పెద్దకథే ఉంది. అమెరికాలో భారత సంతతికి చెందిన డాక్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి 2017లో వచ్చిన మీడియా కథనాలపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఎంసీఐకు నోటీసులు జారీ చేసింది. రోగులతో డాక్టర్ల సెక్సువల్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్ రూపొందించిన ఎంసీఐ.. కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు విచారణను న్యాయస్థానం జూలై 16కు వాయిదా వేసింది.

English summary
The Medical Council of India has adopted guidelines on sexual boundaries for doctors as framed by the Indian Psychiatric Society to be followed by medical practitioners while examining and treating patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X