బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు మహిళా ఉద్యోగులపై ఎండీ రేప్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓ కంపెనీ ఎండీ తన దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు తీసుకు వెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తున్నాడు. నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

బాధితులు ధైర్యం చేసి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చెయ్యడంతో ఆ ఎండీ బండారం భయటపడింది. అతనిని అరెస్టు చెయ్యడానికి బెంగళూరు నగర పోలీసులు సిద్దం అయ్యారు.

మైకో లేఔట్ లో నివాసం ఉంటున్న భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంజీ రోడ్డులోని రహేజా టవర్స్ లో మై ఫ్యామిలీ హెల్త్ ఆఫ్షన్స్ అనే ప్రయివేట్ హెల్త్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. టెలి మార్కెటింగ్ ఉద్యోగాలంటూ తన కంపెనీలో అమ్మాయిలను నియమించుకున్నాడు.

అందమైన అమ్మాయిలు

అందమైన అమ్మాయిలు

తన దగ్గర పని చేస్తున్న అందమైన మహిళా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నమ్మించి అధికార పర్యటనల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు.

హోటల్ లో ఒకే గది

హోటల్ లో ఒకే గది

తరువాత హోటల్ లో ఒకే గది తీసుకుంటున్నాడు. తన గదిలో అమ్మాయిలకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి వారు మత్తులోకి వెళ్లిన తరువాత అత్యాచారం చేసేవాడు.

వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

అత్యాచారం చేసే సమయంలో నగ్నంగా ఉన్న వారిని వీడియో తీసేవాడు. అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే ఆ వీడియోలు చూపించి బెదిరించేవాడు. నగ్నంగా ఉన్న వీడియోలు చూపించి మళ్లీ తన కోరిక తీర్చాలని వారిని వేధించాడు.

బలవంతంగా అనుభవిస్తున్నాడు

బలవంతంగా అనుభవిస్తున్నాడు

ఆవిధంగా అమ్మాయిలను బలవంతంగా అనుభవిస్తున్నాడు. భానుప్రకాష్ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు మహిళా ఉద్యోగులు (బాధితులు) బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

ఆరా తీస్తున్న పోలీసు అధికారులు

ఆరా తీస్తున్న పోలీసు అధికారులు

విషయం తెలుసుకున్న భానుప్రకాష్ మాయం అయ్యాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు భానుప్రకాష్ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

భానుప్రకాష్ కోసం వేట

భానుప్రకాష్ కోసం వేట

కామాంధుడు భానుప్రకాష్ ను అరెస్టు చెయ్యడానికి పోలీసులు గాలిస్తున్నారు. భానుప్రకాష్ బాధితులు చాల మంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని, అతని దగ్గర ఉన్న వీడియోలు స్వాధీనం చేసుకోవాలని బాధితులు మనవి చేశారు.

కేసులు పెట్టారు.... డీసీపీ

కేసులు పెట్టారు.... డీసీపీ

భానుప్రకాష్ మీద ఇప్పటికే హుళిమావు, తిలక్ నగర పోలీస్ స్టేషన్ లలో బాధితులు కేసులు పెట్టారు. భాను ప్రకాష్ మీద కేసులు నమోదు అయ్యాయని బెంగళూరు సౌత్ డీసీపీ ఎంబీ. భోరలింగయ్య దృవీకరించారు.

English summary
The accused was booked after the employees approached the city police commissioner seeking action against the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X