• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)

|

న్యూఢిల్లీ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతి వార్తను ఆమెతో సాన్నిహితంగా మెలిగేవారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కుమిలిపోతున్నారు. ఆమెకు అంజలి ఘటించేందుకు భారమైన హృదయంతో వస్తున్నారు. నిర్జీవంగా ఉన్న సుష్మను చూసి బోరున కంటతడి పెడుతున్నారు. మరికొందరు సుష్మ భౌతికకాయం వద్దే తూళ్లిపడిపోతున్నారు. సుష్మ అని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మంచికి మారుపేరు సుష్మ స్వరాజ్.. ఆమె ఆకాల మరణం సన్నిహితులకు షాక్‌నకు గురిచేసింది. సుష్మాను కడసారి చూసేందుకు వచ్చారు ఎండీహెచ్ వ్యవస్థాపకులు మహశయ్ ధరమ్‌పాల్ గులాటీ. 96 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్‌గా ఉన్న గులాటీ .. సుష్మను చూసి పిల్లాడిలా కంటతడి పెట్టారు. శవపేటికలో త్రివర్ణ పతాకం కప్పిన సుష్మ స్వరాజ్ అచేతనంగా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయారు. సుష్మ అంటు బోరున విలపించారు. అక్కడే తూళ్లిపడిపోయారు. సుష్మ పాదాల వద్ద అంజలి ఘటించాక ఏడవడంతో .. అక్కడున్న వారు కూడా కంటితడి పెట్టుకున్నారు.

MDH owner Mahashay Gulati breaks down Sushma Swarajs feet

ఎప్పటిలాగే సుష్మ స్వరాజ్‌కు అంజలి ఘటించేందుకు వచ్చిన గులాటీ .. భావోద్వేగానికి గురయ్యారు. తలకు ఎర్రని తలపాగా చుట్టుకొని, నెరిసిన మీసంతో వచ్చిన ఆయన .. ఒక్కసారిగా ఏడ్చారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మ స్వరాజ్ భౌతిక కాయం వద్ద చిన్నపిల్లాడి మాదిరిగా కన్నీటిపర్యంతమయ్యారు గులాటి. ఆయనను ఆపడం ఎవరితరం కాలేదు. గులాటీ రోదనతో సుష్మ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సాల్ కూడా కుప్పకూలిపోయారు. సుష్మ లేరనే విషయాన్ని భరించలేని ఆమె అత్తగారు, తల్లిగారి కుటుంబాలు కళ్ల నుంచి వస్తోన్న నీటిని ఆపుకోని మరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

English summary
mahashay Dharampal Gulati, the owner of MDH spices, was seen crying inconsolably while paying tributes to the former External Affairs Minister Sushma Swaraj. The 96-year-old man broke down and sat at the feet of Sushma Swaraj's body on seeing the veteran BJP leader in a casket, wrapped in the tricolour. Although Gulati was dressed in his trademark red pagdi and was sporting the famous white moustache, the MDH owner did not look his usual self as he cried profusely with his arms spread towards the motionless body of Sushma Swaraj kept at the BJP headquarters. Sushma Swaraj's husband Swaraj Kaushal and daughter Bansuri, too, broke down as officers draped the tricolour on the body of the BJP stalwart.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more