వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ వైఖరికి నేను చింతిస్తున్నా.. ఖండిస్తున్నా: వైగో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదురైనా... ఎండీఎంకే అధినేత వైగో ఆయన మద్దతుదారులతో ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళ మీడియా వార్తా కథనాలు ప్రకారం ఎండీఎంకే మద్దతుదారులు ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఆ తర్వాత పలు చోట్ల భారీ ఎత్తున సభలు నిర్వహించి శ్రీలంకలోని తమిళుల కోసం ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో జరుగుతున్న 18వ సార్క్ సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించడాన్ని వైగో ఖండించినట్లు ఓ ప్రకటన విడుదలయింది.

MDMK chief Vaiko celebrates 60th birthday of slain LTTE founder Prabhakaran

" సార్క్ సదస్సులో ప్రధానమంత్రి మోడీ వైఖరికి నేను చింతిస్తున్నా. పలువురు తమిళులను చంపిన వ్యక్తితో అలా వ్యవహరించడం సరైంది కాదు. ఇందుకు నేను సిగ్గుపడుతున్నా, ఖండిస్తున్నా" అని వైగో అన్నారు.

ఇక శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఉద్యమించి 2009లో లంక సైన్యం చేతిలో హతమైన ఎల్‌టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ 60వ జయంతిని ఈరోజు ఘనంగా జరపాలని ఎండీఎంకే నేత వైగో పిలుపు ఇచ్చారు. ప్రభాకరన్ జన్మదిన వేడుకలు జరపడం భారత విధానానికి వ్యతిరేకమని, ఇవి జరగకుండా ఆపాలని తమిళనాడులోని పలు రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతికి కారణమైన ప్రభాకరన్ పుట్టినరోజుని జరగకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కోరారు. వైగోపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు

శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్సేకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదుగురు భారతజాలర్లను క్షమించి వదిలిపెట్టినందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ అక్రమరవాణా కేసులో ఐదుగురు తమిళజాలర్లకు శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిన విషయం తెలిసిందే.

English summary
MDMK founder Vaiko on Wednesday celebrated 60th birthday of slain LTTE founder Prabhakaran and called for grand celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X