• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీటూ ఉద్యమం బూటకం...ఇక్కడంతా ఇచ్చిపుచ్చుకోవడమే: శిల్పా

|
  #మీటూ పై శిల్పా షిండే స్పందన

  సోషల్ మీడియా వేదికగా ఓ వైపు మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. పలు రంగాల్లో మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గూర్చి సామాజిక మాధ్యమాల్లో బయటపెడుతున్నారు. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. కొందరు మాత్రం మీటూ ఉద్యమంలో వాస్తవం లేదని... ఆనాడు చెప్పని వారు నేడు బయటికొచ్చి చెప్పడం వల్ల ఉపయోగం ఏముందని వాదిస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్‌బాస్ -11 విన్నర్ శిల్పా షిండే కూడా మీటూ ఉద్యమం బూటకమని అన్నారు.

   ఇద్దరి అంగీకారంతోనే లైంగిక కలయిక

  ఇద్దరి అంగీకారంతోనే లైంగిక కలయిక

  మీటూ ఉద్యమంతో చాలామంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి బాహాటంగానే చెబుతున్నారు. ఆ సమయంలో పురుషులు తీసుకొచ్చిన ఒత్తిడికి తాము లొంగిపోవాల్సి వచ్చిందని కొందరు మహిళలు చెబుతుండగా...కొందరు మాత్రం వారి ఒత్తిళ్లకు లొంగలేదని చెప్పారు. తాజాగా బిగ్‌బాస్-11 విజేత శిల్పాషిండే మాత్రం మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా ఒట్టిదేనంటూ చెబుతూ ... ఇండస్ట్రీలో ఎవరూ ఎవరిపైనా అత్యాచారం కాని లైంగికదాడికి కానీ పాల్పడరని ఇదంత ఇద్దరి మధ్య లేదా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే లైగింక కలయిక జరుగుతుందని అన్నారు. ఇదంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సాగుతుందని ఆమె అన్నారు.

  లైంగిక దాడి జరిగినప్పుడే ఎందుకు చెప్పలేదు..?

  లైంగిక దాడి జరిగినప్పుడే ఎందుకు చెప్పలేదు..?

  నిజంగానే నాడు మహిళలు ఒత్తిడికి గురై ఉంటే అప్పుడే చెప్పాల్సిందని...కొన్నేళ్లు గడిచిన తర్వాత బయటకు చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటని శిల్పా ప్రశ్నించారు. ఇప్పుడు ఆ కథలను ఎవరూ నమ్మరని..పైగా ఎలాంటి మేలు చూకూరదు సరికదా... కేవలం వివాదాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని శిల్పా చెప్పింది. వాస్తవానికి మీటూ ఉద్యమం గురించి తను మాట్లాడేందుకు ఇష్టపడనని కానీ ఇదంతా చూస్తుంటే కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇలా బయటికి వచ్చి చెప్పడం వల్ల మార్పు రాదని చెప్పిన శిల్పా... ఇది కొనసాగుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా ఆరోపణలు చేసి కొందరు మహిళలు ఇండస్ట్రీ పేరును చెడగొడుతున్నారని అన్నారు. ఇండస్ట్రీలో ఇంత చెండాలం జరుగుతోందా అంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకోవడం నిజంగా సిగ్గు చేటని ఆమె ధ్వజమెత్తారు.

  ఇండస్ట్రీలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే నడుస్తుంది

  ఇండస్ట్రీలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే నడుస్తుంది

  ఇండస్ట్రీని వెనకేసుకొచ్చిన శిల్పా ఇంకా చాలా విషయాలు తెలిపారు."సినిమా ఇండస్ట్రీ చెడ్డది కాదు.. అలా అని చాలా మంచిది కూడా కాదు. ఇలాంటి ఘటనలు ప్రతి చోట జరుగుతాయి. ఒక్క సినిమా ఇండస్ట్రీనే చెడగొట్టాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. మంచి అవకాశాలు వస్తే అక్కడ ఎంత లైంగిక వేధింపులు జరిగినా బయటకు చెప్పరు. అదే అవకాశాలు కోల్పోతున్న సమయంలో బయటకొచ్చి లైంగిక ఆరోపణలు చేయడం సరికాదు.ఇక్కడంతా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం నడుస్తుంది. మీవల్ల కాకపోతే విషయాన్ని అంతటితో ఆపేయాలి"అని శిల్పా అన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Bigg Boss 11 winner Shilpa Shinde has rubbished the #MeToo Movement saying there's no rape and whatever happens in the industry is a mutual thing. "It’s rubbish. You have to take a call that time only, it’s simple. You should speak about that matter that time only"The actress said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more