• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'మీడియా టీఆర్‌పీ కోసం నన్ను నేరస్తురాలిని చేసింది.. కోర్టు కాదు': దిశా రవి ఆవేదన - Newsreel

By BBC News తెలుగు
|
దిశా రవి

టూల్ కిట్ కేసులో అరెస్ట్ అయిన పర్యావరణ కార్యకర్త దిశా రవి బెయిల్‌పై విడుదల అయిన తరువాత తొలిసారిగా శనివారం ఒక ప్రకటకన విడుదల చేశారు.

ట్విట్టర్‌లో విడుదల చేసిన నాలుగు పేజీల ప్రకటనలో మీడియాను విమర్శించడంతోపాటూ తనకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

"ఏది వాస్తవమో అది సత్యానికి చాలా దూరంగా ఉంది: దిల్లీ పొగ (స్మాగ్), పటియాలా కోర్టు, తీహార్ జైలు. రాబోయే ఐదేళ్లల్లో మీరు ఎక్కడ ఉంటారని ఎవరైనా అడిగితే జైలు మాత్రం కాదని చెబుతాను'' అని పేర్కొన్నారు.

''ఆ సమయంలో, అక్కడ ఉన్నప్పుడు ఎలా అనిపించింది అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. కానీ, నా దగ్గర సరైన సమాధానం లేదు. ఇదంతా ఎలా ఎదుర్కోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నాకొక్కటే మార్గం కనిపిస్తోంది.. ఇదంతా నాకు జరగట్లేదని అనుకోవాలి. 2021 ఫ్రిబ్రవరు 13న పోలీసులు నాకోసం రాలేదు. నన్ను అరెస్ట్ చెయ్యలేదు. నన్ను పటియాలా హౌస్ కోర్టుకు తీసుకెళ్లలేదు. అక్కడ మీడియా నన్నేం ప్రశ్నించలేదు'' అని ఆమె ఆ ప్రకటనలో రాశారు.

''కోర్టులో ఏం చెప్పాలో నాకర్థం కాలేదు. అర్థమయ్యేసరికి నన్ను ఐదు రోజులు కస్టడీలో ఉంచారు. తరువాత, నా హక్కుల హననం జరిగింది. మీడియా నిండా నా ఫొటోలే. నన్ను నేరస్థురాలిని చేశారు. కోర్టు చెయ్యలేదు గానీ మీడియా తమ టీఆర్‌పీ కోసం నన్ను నేరస్థురాలిని చేసేసింది'' అంటూ దిశా రవి ఆవేదన వ్యక్తంచేశారు.

https://twitter.com/disharavii/status/1370716887907246085

''నా గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో తెలీక నేను అక్కడ కూర్చున్నాను. ఈ దురాశకు, వినిమయతత్వానికి మనం త్వరగా స్వస్తి చెప్పకపోతే పర్యావరణంలాగానే మనం వినాశనానికి దగ్గరవుతూ ఉంటాం" అని పేర్కొన్నారు.

తనకు మద్దతునిచ్చి, సహాయంగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. "నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు ప్రో-బోనో (ప్రజా ప్రయోజన) చట్టం సహాయం లభించింది. కానీ ఇలాంటి సహయం అందని వారి సంగతేంటి? ఆ వెనుకబడిన వర్గాల వారి సంగతేంటి?" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆలోచనలు ఎప్పుడూ అంతమైపోవు. ఎంత కాలమైనా సరే నిజం బయటకు రాక తప్పదు" అన్నారామె.

కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా గ్రేటా థన్‌బర్గ్ సోషల్ మీడియా షేర్ చేసిన 'టూల్ కిట్'‌కు సంబంధించి దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఫిబ్రవరి 13న బెంగళూరులో దిశా రవిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 23న దిల్లీ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Media made me guilty for TRP not court': Disha Ravi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X