వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా సిబ్బందిని ఆసుపత్రిలో బంధింపచేసిన యూపి సీఎం ...!

|
Google Oneindia TeluguNews

యూపి ముఖ్యమంత్రి అదిత్యానాథ్ వివాదంలో చిక్కుకున్నాడు.. తన పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులను ఆసుపత్రి ఎమర్జెన్సీ రూంలోనే సుమారు రెండు గంటల పాటు బంధించడం పోలీసులు బంధించడం వివాదానికి తెరలేపింది.కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటన ముగించుకుని వెళ్లిన ఆర్ధగంట తర్వాత నేరుగా జిల్లా కలెక్టర్ వెళ్లి జర్నలిస్టులు ఉన్న రూం తాళం తీశారు..దీంతో ఈ సంఘటనపై ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన యూపి సీఎం

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన యూపి సీఎం

ఆదివారం యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోరదాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించడానికి వెళ్లారు...అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా సిబ్బంది కూడ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి కలిసి ప్రశ్నలు అడుగుతారనే ఉద్యోశ్యంలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పోలీసులు రిపోర్టర్లను ముఖ్యమంత్రిని కార్యక్రమాన్ని కవర్ చేయకుండా అడ్డుకున్నారు...ముఖ్యమంత్రి కంటే ముందుగానే చేరుకున్న మీడియా సిబ్బందిని ఆసుపత్రిలోని ఎమెర్జ్రెన్సీ హల్లోనే సుమారు రెండు గంటల పాటు బంధించినట్టు మీడియా సిబ్బంది తెలిపారు..కాగా సీఎం వెళ్లిన అర్థగంట తర్వాత ఆసుపత్రి డీఎం వచ్చి తాళం తీసినట్టు వారు తెలిపారు.

ఆరోపణలు కొట్టిపారేసిన ఆసుపత్రి వర్గాలు..

ఆరోపణలు కొట్టిపారేసిన ఆసుపత్రి వర్గాలు..


అయితే సంఘటనపై వచ్చిన ఆరోపణలను ఆసుపత్రి డీఎం రాకేష్ కుమార్ కొట్టిపారేశారు.. తాము ముఖ్యమంత్రి వస్తున్న సమయంలో రోగులు ఉన్న వార్డుల్లోకి వెళ్లవద్దంటూ సూచించామని ఆయన తెలిపారు. అయినా మీడీయా సిబ్బంది వార్డుల్లో వెళ్లారని ఆయన చెప్పారు.మీడియా సిబ్బందిని అడ్డుకోలేదని తెలిపారు..మరోవైపు డీఎం స్వయంగా వెళ్లారని తాళం తీశారని మీడియా సిబ్బంది తెలిపారు..రూంకు తాళం వేసిన అనంతరం పోలీసు అధికారులను కూడ అక్కడ ఉంచారని మీడియా సిబ్బంది ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు..

జర్నలిస్టుల బంధీపై ప్రశ్నించిన ప్రియాంక గాంధీ

జర్నలిస్టుల బంధీపై ప్రశ్నించిన ప్రియాంక గాంధీ

దీంతో ఇది వివాదంగా మారింది..ప్రజల సమస్యలను ప్రస్థావించే మిడీయా సిబ్బందిపై సీఎం ఇలా వ్యవహరించడంపై అక్కడి ప్రతి పక్ష పార్టీలు మండిపడుతున్నాయి..ఈనేపథ్యంలోనే యూపి ఇంచార్జ్ గా ఉన్న ప్రియాంక్ గాంధి సైతం ఈ ఘటనపై స్పందించారు..మీడీయాను బంధించడంపై ఆమే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..ఇలా చేయడం మీడీయా స్వేఛ్చను హరించడమే ప్రియాంకమండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన భాజపా ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆమే విమర్శలు చేశారు.

కాగా గత కొద్ది రోజుల క్రితం యూపిలో సీఎంపై అభ్యంతరకర అంశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారంటూ ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన ప్రశాంత్ కనోజాను ఆరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

English summary
several media persons were reportedly locked up in the emergency ward of a district hospital on the orders of Moradabad district magistrate during Uttar Pradesh Chief Minister Yogi Adityanath's routine visit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X