వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్నాళ్లూ గొప్పగా: ఉద్యోగాలను కోల్పోయిన హెచ్-1బీ విసాదారుల నెత్తిన కొత్త పిడుగు: పెను భారం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇన్నాళ్లూ గొప్పగా చెప్పుకొన్న హెచ్-1బీ విసా ఇప్పుడు భారంగా పరిణమించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చేపట్టి చర్యల వల్ల అగ్రరాజ్యం అమెరికాలో చేపట్టిన ఆర్థిక చర్యల ప్రభావం హెచ్-1బీ విసాదారులపై తీవ్రంగా పడటం ఖాయంగా కనిపిస్తోంది. చేతిలో ఉద్యోగం ఉంటే ఫర్వాలేదనుకోవచ్చు గానీ.. కరోనా వైరస్ వల్ల నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగాలను కోల్పోయి ఉంటే మాత్రం పెనుభారం తప్పకపోవచ్చు.. మెడికల్ ఇన్సూరెన్స్ రూపంలో. భవిష్యత్తులో మెడికల్ ఇన్సూరెన్స్‌ను చెల్లించడం కష్టతరమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

జగన్ సర్కార్‌కు మరక: హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉండగా.. రైతు భరోసా కేంద్రాలకు రంగులుజగన్ సర్కార్‌కు మరక: హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉండగా.. రైతు భరోసా కేంద్రాలకు రంగులు

కన్సాలిడేటెడ్ ఒమ్నిబస్ బడ్జెట్ రికన్సిలియేషన్ యాక్ట్-1985 (కోబ్రా) ప్రకారం.. హెచ్-1బీ విసా ఉన్న ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య బీమా అందుతోంది. అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న ఓ హెచ్-1బీ కార్డుదారుడు సంవత్సరానికి సటున 70 వేల నుంచి లక్షా 20 వేల డాలర్లను సంపాదిస్తుంటారు. కోబ్రా యాక్ట్ కింద మెడికల్ ఇన్సూరెన్స్‌ను పొందిన ఉద్యోగి ఆ వెంటనే 100 శాతం మేర ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన ఉద్యోగికి, అతని కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వేతనం పెరిగే కొద్దీ ఈ శ్లాబుల్లో మార్పులు వస్తుంటాయి.

Medical insurance a burden for laid-off H-1B employees who lost their jobs

తాజాగా- కరోనా వైరస్ ప్రభావం వల్ల గానీ, దీన్ని నివారించడానికి అమెరికా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గానీ ఉద్యోగాలను కోల్పోయిన హెచ్-1బీ విసాకార్డుదారులు ఈ మొత్తాన్ని తప్పనసరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోబ్రా చట్టం ప్రకారం అలా చెల్లించడం తప్పనిసరి. ఈ మెడికల్ ఇన్సూరెన్స్‌ను కొనసాగించడమే మేలు అని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాన్ని కోల్పోయిన తరువాత కూడా ఆ బీమా వర్తిస్తుంది.

ఉద్యోగం కోల్పోవడం వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రీమియం మొత్తాన్ని చెల్లించక, దాన్ని కొనసాగించని పరిస్థితులు తలెత్తవచ్చు. దాన్ని ఎదుర్కొంటూనే మెడికల్ ఇన్సూరెన్స్‌ను కొనసాగించడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని న్యూయార్క్‌కు చెందిన సైరస్ డీ మెహతా అనే నిపుణుడు తెలిపారు. దీన్ని కొనసాగించడం వల్ల హెచ్-1బీ/ఈఎడీ (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కింద ఉద్యోగికి, అతని కుటుంబ సభ్యులకు కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు అశ్విన్ శర్మ తెలిపారు.

English summary
Employees on H-1B visas in the US who have lost their jobs will have to pay steep sums for medical insurance for themselves and their families if they opt to continue with the employer-sponsored health cover. But experts also advice that it’s often best to continue with these employer schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X