ట్విస్ట్: ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు మేజరే, మళ్ళీ పరీక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో:ఉన్నావ్ అత్యాచార కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. బాధితురాలు మైనర్‌ కాదు మేజర్ అంటూ వైద్యులు ఇచ్చిన నివేదికతో గందరగోళం నెలకొంది. యువతి మైనర్‌‌గా భావించిన పోలీసులు బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.కానీ, బాధితురాలి వయస్సు 19 ఏళ్ళని వైద్యులు నిర్ధారించడంతో వయస్సు నిర్దారణ కోసం మళ్ళీ పరీక్షలు నిర్వహించారు. నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

ఉన్నావ్ రేప్ కేసు వెలుగు చూసిన తర్వాత 2017 జూన్ 22న పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రేడియాలజిస్టు ఎస్ జోహ్రీ బాధితురాలు మేజర్ అని నివేదికను ఇచ్చారు. అప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయమై బాధితురాలు ఎమ్మెల్యే పేరును మేజిస్ట్రేట్ ఎదుట చెప్పలేదు. ఆ తర్వాత రెండో ఎఫ్ఐఆర్ లో బిజెపి ఎమ్మెల్యే సెంగార్ పేరును బాధితురాలు ప్రస్తావించారు. 2018 ఏప్రిల్ 12న ఎమ్మెల్యేపై ఫోక్సో చట్టం ప్రకారంగా కేసు నమోదు చేశారు.

Medical report from last year says Unnao rape survivor was 19 years old

మొత్తంగా ప్రాథమిక వైద్య పరీక్షలో ఆమె వయస్సు 19 ఏళ్ళుగా ఉన్న విషయాన్ని సీబీఐ గుర్తించింది. కేసులు మాత్రం మైనర్‌పై అత్యాచారం చేసినప్పుడు వర్తించే కేసును పెట్టారు. దీంతో బాధితురాలికి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయం తసీుకొంది. ఈ మేరకు శనివారం నాడు బాధితురాలికి లక్నో ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేసు సెక్షన్ల మార్పిడి చేయాలని సీబీఐ భావిస్తోంది. బాధితురాలు మైనర్‌ కాదని తేలితే సెక్షన్లు మార్చి దర్యాప్తును కొనసాగిస్తారు. మైనర్‌గా తేలితే అదే సెక్షన్లతో కేసును కొనసాగించనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Confusion continues to prevail over the age of the Unnao rape survivor. A medical report in June 2017, shortly after the alleged rape says the survivor was 19 years old, contradicting her claim that she was born in July 2002.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X