• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళా నీకు వందనం: పైలట్ ఉద్యోగం పొందిన తొలి గిరిజన యువతి అనుప్రియ

|

కృషి , దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది ఆ గిరిజన యువతి. పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకుంది ఒడిషా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23 ఏళ్ల అనుప్రియా లక్రా. అసలే మల్కాన్ గిరి అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతం. ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలోనే వదిలేసి పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు ముందుకేసింది. 2012లో ఏవియేషన్ అకాడెమీలో చేరింది. అనుకున్నది సాధించింది.

బడ్జెట్ 1 లక్ష 46 వేల 492 కోట్లు .. పద్దుపై ఆర్థికమాంద్యం ఎఫెక్ట్... ఓటాన్ కంటే తగ్గిన వ్యయం

పైలట్ అవ్వాలనేది నాకల: అనుప్రియ

పైలట్ అవ్వాలనేది నాకల: అనుప్రియ

అనుప్రియా లక్రాకు పైలట్ కావాలనే కోరిక బలంగా ఉండేది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చదవి ఓ స్థాయికి రావడమంటే మామూలు విషయం కాదు. కానీ ఈ గిరిజన యువతి అనుప్రియా మాత్రం ఎక్కడా వెనుకంజ వేయలేదు. తన చదువును కొనసాగించింది. అయితే పైలట్ కావాలని తపించిన అనుప్రియ.. ఇంజినీరింగ్‌ను మధ్యలోనే వదిలేసి ఏవియేషన్ అకాడెమీలో 2012లో చేరింది. ఏడేళ్ల తర్వాత ఆమె కల సాకారమైంది. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో అనుప్రియ కో-పైలట్‌గా ఉద్యోగం సంపాదించింది.

అనుప్రియను అభినందించిన సీఎం నవీన్ పట్నాయక్

అనుప్రియను అభినందించిన సీఎం నవీన్ పట్నాయక్

గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి ఉన్నత ఉద్యోగం పొందడంపై ఒడిషా సీఎం పట్నాయక్ అనుప్రియను అభినందించారు. తన పట్టుదల దీక్షతోనే అనుప్రియ అనుకున్నది సాధించిందని చెప్పిన సీఎం నవీన్ పట్నాయక్... ఆమె స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఏవియేషన్ రంగంలో అనుప్రియ మరిన్ని విజయాలు ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు నవీన్ పట్నాయక్.

ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసింది

ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసింది

ఇక అనుప్రియ కుటుంబ నేపథ్యం చూస్తే తండ్రి మరినియాస్ లక్రా ఒడిషా పోలీసు శాఖలో హవల్దార్‌గా పనిచేస్తున్నారు. తల్లి జమాజ్ యష్మీన్ లక్రా గృహిణి. మల్కాన్‌గిరి జిల్లాలో ఓ కాన్వెంట్‌లో పదోతరగతి వరకు చదివింది. అనంతరం సేమిలిగుడలో ఇంటర్మీడియెట్‌ను అభ్యసించింది. ఇక పైలట్ కావాలన్న బలమైన కోరికతో ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసింది. భువనేశ్వర్‌లో పైలట్ ఎంట్రెన్స్ టెస్టు కోసం ప్రిపేర్ అయినట్లు తండ్రి చెప్పారు. 2012లో అనుప్రియ భువనేశ్వర్‌లో పైలట్ ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్‌లో చేరినట్లు ఆమె తండ్రి చెప్పారు. ఆమె కన్న కలను సాకారం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తండ్రి మరినియాస్ లక్రా.

అనుప్రియ మల్కాన్‌గిరి జిల్లాకు గర్వకారణం

అనుప్రియ మల్కాన్‌గిరి జిల్లాకు గర్వకారణం

ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో కో-పైలట్‌గా ఉద్యోగం సంపాదించిందని త్వరలో విదేశాలకు వెళ్లనున్నట్లు అనుప్రియ తండ్రి చెప్పారు. వెనకబడిన జిల్లా నుంచి ఒక అమ్మాయి పైలట్‌గా ఉద్యోగం సంపాదించడమంటే చాలా గొప్పవిషయమని తండ్రి చెప్పారు. ఏడేళ్ల కష్టం తర్వాత ఆమె అనుకున్నది సాధించిందని హర్షం వ్యక్తం చేశారు అనుప్రియ తండ్రి. తన కూతురు సాధించిన విజయం పట్ల చాలా గర్వంగా ఉందని తల్లి చెప్పారు. ఇది మొత్తం మల్కాన్‌గిరి జిల్లాకే గర్వకారణమని చెప్పారు. అనుప్రియ విజయం జిల్లాలోని ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. అనుప్రియ ఏదైనా అనుకుందంటే అది సాధించేవరకు ప్రయత్నిస్తూ ఉంటుందని తల్లి చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Her dream to touch the sky has catapulted a tribal woman from Odisha’s Maoist-hit Malkangiri district to become the first female pilot from the backward region.Twenty-three-year-old Anupriya Lakra’s dream of becoming a pilot has become a reality seven years after she quit engineering studies midway and joined an aviation academy here in 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more