వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్‌రూపానికి చుక్కలు చూపిన రాజ్‌గురు, ఎవరీ రాజ్‌గురు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

BJP Wins Rajkot West Assembly Seat విజయ్‌రూపానికి చుక్కలు చూపిన రాజ్‌గురు !

గాంధీనగర్: గుజరాత్ ప్రస్తుత సీఎం విజయ్ రూపానీపై కాంగ్రెస్ పార్టీ ఇంద్రనీల్ రాజ్‌గురును బరిలోకి దింపింది. అయితే రాజ్‌గురు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరికంటే ధనవంతుడని ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కలను బట్టి తెలుస్తోంది.అయితే గుజరాత్ సీఎం విజయ్ రూపానీపై ఇంద్రనీల్ రాజ్ గురు ఉద్దేశ్యపూర్వకంగా పోటీ చేస్తున్నారు. విజయ్ రూపానీని ఓడించాలనే లక్ష్యంగానే రాజ్‌కోట్ వెస్ట్ నుండి రాజ్ గురు బరిలోకి దిగారు. ప్రస్తుతం రాజ్‌కోట్ ఈస్ట్ నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే హోరాహోరీగా జరిగిన ఈ పోరులో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇంద్రనీల్ రాజ్ గురుపై 4700 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కొన్ని రౌండ్లలో విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో విజయ్ రూపానీపై ఇంద్రనీల్ రాజ్ గురు రాజ్ కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. రాజ్ కోట్ ప్రాంతం నుండి విజయం సాధించి ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారెవరు కూడ ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోలేదని రాజగ్ గురు ఆరోపణలు గుప్పించారు.

విజయ్ రూపానీని ఓడించడం ద్వారా తన సత్తాను నిరూపించుకోవాలని ఇంద్రనీల్ రాజ్‌గురు భావిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాన్ని కూడ ఇంద్రీనీల్ మార్చుకొన్నారు.

ఎవరీ ఇంద్రీనీల్ రాజ్ గురు

ఎవరీ ఇంద్రీనీల్ రాజ్ గురు

రాజ్‌కోట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇంద్రనీల్ రాజ్ గురు 1966 జూన్ 26న, జన్మించారు. ట్రేడర్‌గా రాజ్‌గురుకు గుర్తింపు ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం రాజ్‌కోట్ ఈస్ట్ అసెంబ్లీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధిక ధనవంతుడైన అబ్యర్థిగా రాజ్‌గురు గుర్తింపు తెచ్చుకొన్నాడు.రాజ్‌కోట్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కూడ ఆయన కొనసాగుతున్నాడు.విజయ్ రూపానీని ఓడించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ నియోజకవర్గం నుండి రాజ్‌గురు బరిలోకి దిగారు.

బిజెపి వెస్ట్‌లో 1985 నుండి బిజెపిదే

బిజెపి వెస్ట్‌లో 1985 నుండి బిజెపిదే

1985 నుండి రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కేశుభాయ్ పటేల్, నరేంద్ర మోడీ, విజయ్ రూపానీలు గుజరాత్ ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అలాంటి నియోజకవర్గంలో ఇంద్రనీల్ రాజ్ గురు పోటీ చేయడం ఒక రకంగా సాహసమనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు.

ఏడాదిగా రాజ్‌కోట్ వెస్ట్‌లో ఇంద్రనీల్ ప్లాన్

ఏడాదిగా రాజ్‌కోట్ వెస్ట్‌లో ఇంద్రనీల్ ప్లాన్

ఏడాది నుండే రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకుగాను ఇంద్రనీల్ రాజ్‌గురు ప్రచారం చేస్తున్నారు. ఇంద్రనీల్ రాజ్ గురు ఎన్నికల ప్రచారాన్ని ఓ కార్పోరేట్ పిఆర్ కంపెనీ నిర్వహిస్తోంది. బిజెపికి మద్దతుగా ఉన్న సంప్రదాయ ఓట్లను కొల్లగొట్టేలా ఇంద్రనీల్ రాజ్ గురు ప్రచారాన్ని నిర్వహించారు.

70 మందితో సోషల్ మీడియా టీమ్

70 మందితో సోషల్ మీడియా టీమ్

70 మందితో సోషల్ మీడియా టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇంద్రనీల్ రాజ్ గురు కొరకు సోషల్ మీడియా టీమ్ 70 మంది పనిచేస్తున్నారు. ఇంద్రనీల్ రాజ్ గురు సోదరి సంద్య నేతృత్వంలో ఈ టీమ్ పనిచేస్తున్నారు.వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం వెయ్యి మంది కొత్తవారిని రాజ్‌గురు కలిసేలా ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న బృందం ప్లాన్ చేసింది.

కాఫీ విత్ ఇంద్రనీల్

కాఫీ విత్ ఇంద్రనీల్

కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఆకర్షించేందుకు కాఫీ విత్ కాంగ్రెస్, కాఫీ విత్ ఇంద్రనీల్ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలతో కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొన్నారు. మరో వైపు ఈ ఓటర్లను ఆకర్షించే దిశగా చర్యలను తీసుకొన్నారు. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

విజయ్ రూపానీ తరహలోనే

విజయ్ రూపానీ తరహలోనే

గుజరాత్ ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ తరహలోనే ఇంద్రనీల్ గురు రాజ్ మున్సిఫల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే బిజెపి అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్‌కోట్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుండి ఇంద్రనీల్ విజయం సాధించారు. 2000 సంవత్సరంలో మున్సిఫల్ ఎన్నికల్లో ఇంద్రనీల్ తొలిసారి విజయం సాధించారు.

అత్యధిక ధనవంతుడైన అభ్యర్థి

అత్యధిక ధనవంతుడైన అభ్యర్థి

అత్యధిక ధనవంతుడైన అభ్యర్థిగా ఇంద్రనీల్ గురురాజ్ పేరొందారు.ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఇంద్రనీల్ రాజ్ గురు సుమారు రూ.1,02,94,729 ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. రాజ్ గురు భార్యపైన రూ.11,43,576 కోట్లు, ఇంద్రనీల్ ఇతర కుటుంబసభ్యులపై రూ.3,89,359 లక్షల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

English summary
Indranil Rajguru, the 51-year-old Congress candidate and currently an MLA from Gujarat’s Rajkot East constituency,face off against BJP candidate chief minister Vijay Rupani from the Rajkot West constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X