వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముళ్ల నిచ్చెనపై మాణిక్‌ ‘సర్కార్’: కాషాయానికే త్రిపుర ఓటు?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఏళ్ల తరబడి పోటీ చేస్తున్న బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కాదుగా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. కానీ రెండున్నరేళ్ల గడువులోపే తాజాగా ఆదివారం పోలింగ్ జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సీపీఎంకు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా సవాల్ విసురుతోంది. 2013 ఎన్నికల్లో కేవలం 1.53 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఆ లెక్క ప్రకారం సవాల్ కు అవకాశమే లేదు. అధికార సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ 48.11 శాతం ఓట్లు పొంది గట్టిగా ఉన్నదన్న సంకేతాలిస్తున్నా.. ఇప్పుడది సందేహస్పదంగా కనిపిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. దీనికి ఆరెస్సెస్ ప్రచారక్ సునీల్ డియోధర్ క్రుషే ప్రధానమనే వాదన వినిపిస్తున్నది. సునీల్ డియోధర్ తెర వెనుక ప్రచారంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్ సర్కార్ సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి బీజేపీ.. నువ్వా? నేనా? అన్నట్లు సవాల్ విసురుతోంది.
దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ తన కంచుకోటలోనే ముఖాముఖీ పోటీని ఎదుర్కొంటున్నది. రెండున్నరేళ్ల క్రితం మహారాష్ట్రలో సీపీఎం ఏకైక స్థానాన్ని గెలుచుకోవడంలో సునీల్ డియోధర్ క్రుషిని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుర్తించి.. త్రిపురలో ఇన్ చార్జీగా నియమించారా? అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. మేఘాలయలో నివసిస్తున్న సునీల్ డియోధర్.. 2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసికి ఇన్ చార్జీగా వ్యవహరించారు. అంతకుముందు 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దాహోద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ బలాబలాలు 5:1గా ఉంటే దాన్ని సమబలంగా మార్చడంలో సునీల్ డియోధర్ కీలకంగా వ్యవహరించారు.

పది స్థానాలకు ఎనిమిది చోట్ల బీజేపీ విజయం

పది స్థానాలకు ఎనిమిది చోట్ల బీజేపీ విజయం

వీటికి ముందుగా 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దక్షిణ ఢిల్లీ ప్రాంత ఇన్ చార్జీగా వ్యవహరించిన సునీల్ డియోధర్ 10 అసెంబ్లీ స్థానాలకు ఏడు బీజేపీ ఖాతాలో పడటంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి వరకు బీజేపీ జాతీయ నాయకత్వం ద్రుష్టిలో ఆయన ఊసే లేదు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కొనసాగింపుగా 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార వ్యూహం బాధ్యత ఆయనపైనే పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో 32 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీగా వ్యవహరించిన సునీల్ డియోధర్.. ప్రత్యేకించి సీపీఎం ప్రాతినిధ్యం వహించిన పాల్ఘార్ స్థానంలో ఆ పార్టీని ఓడించడంలో కీలకంగా వ్యవహరించడమే ఆయనను త్రిపురకు బీజేపీ డిప్యూట్ చేయడానికి దారి తీసింది. రెండున్నరేళ్ల క్రితమే త్రిపురలో తిష్ట వేసి సునీల్ డియోధర్ కొద్ది మంది గల పార్టీ, ఆరెస్సెస్ కార్యకర్తలతో కలిసి ప్రచార వ్యూహం రూపొందించారు. అందుకు తీవ్రంగా శ్రమించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తమను కలిసి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పునాది ఏర్పాటు చేసుకున్న బీజేపీ.. ఆరు నెలలుగా సీపీఎంలో అసమ్మతి వాదులను చేరదీస్తూ వచ్చింది.

10 ఎస్సీ స్థానాల్లో 8చోట్ల బీజేపీ విజయ సంకేతాలు?

10 ఎస్సీ స్థానాల్లో 8చోట్ల బీజేపీ విజయ సంకేతాలు?

త్రిపురలో ఓబీసీల జనాభా 35 శాతం. సునీల్ డియోధర్ ఈ దఫా ఓబీసీలెవ్వరూ సీపీఎంకు ఓటేయరని ఘంటాపథంగా చెబుతున్నారు. దళితులకు రిజర్వు చేసిన 10 స్థానాల్లో ఎనిమిది చోట్ల గెలుస్తామని ఆయన చెప్పారు. గిరిజనులకు పట్టు గల 20 స్థానాల్లో బీజేపీ పట్ల ఆగ్రహం ఉన్నా.. అక్కడ ఇద్దరు పార్టీ ఉపాధ్యక్షులు, నలుగురు కోర్ కమిటీ సభ్యులు పని చేస్తున్నారని చెప్పారు. గతేడాది ఆగస్టులో బీజేపీలో చేరిన విపక్ష నేత దీబా చంద్ర హ్రంగ్ఖావాల్.. గిరిజనుల సమస్యలపై పోరాటం ప్రారంభించడంతో అధికార సీపీఎంలో కదలికలు మొదలయ్యాయి.

బీజేపీ విస్తరణపై సీపీఎంలో ఆందోళన

బీజేపీ విస్తరణపై సీపీఎంలో ఆందోళన

కేవలం 18 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రచారకర్తను నియమించడంతో తొలిసారి తాము విస్తరిస్తున్నామన్న సంగతిని సీపీఎం గుర్తించింది. దీనికి చంద్రమోహన్ అనే విస్తారక్ హత్యకు గురి కావడమే దీనికి నిదర్శనం. ఈ హత్య తర్వాత అన్ని స్థానాల పరిదిలో చంద్రమోహన్ అస్తికలతో చేపట్టిన శాంతియాత్ర ప్రజలను ఆకర్షించిదని సునీల్ డియోధర్ చెబుతారు. ప్రజలంతా సీపీఎం పట్ల ఆగ్రహావేశాలతో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రమోహన్ అనే విస్తారక్ హత్యకు వ్యతిరేకంగా 62 చోట్ల నిర్వహించిన జైలుభరోలో 42 వేల మంది పాల్గొన్నారు. గతంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఈ సాహసం చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

సోషల్ మీడియాకు దూరమే సీపీఎంకు ఇలా నష్టం

సోషల్ మీడియాకు దూరమే సీపీఎంకు ఇలా నష్టం

మోదీ టీ - షర్టులు ధరించిన యువత ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి అగర్తల నుంచి ధర్మనగర్ కు వెళ్లే రైలులో పుస్తకాలతో ప్రచారం చేపట్టామని,. బంగ్లా, కోర్బోరోక్ భాషల్లో వాటిని ముద్రించి రైలులో పంపిణీ చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రజలతో మాట్లాడేందుకు ఇబ్బందికర పరిస్తితులు ఉండేవన్నారు. కానీ రైళ్లలో స్వేచ్చగా ప్రచారం చేయడంతో సీపీఎం పట్ల వ్యతిరేకత ఉన్నదని అర్థమవుతున్నదని బీజేపీ చెబుతోంది. సోషల్ మీడియా మద్దతుతో ఏర్పాటు చేసిన వార్ రూమ్.. తర్వాత కాల్ సెంటర్.. ప్రజలకు చేరువ కావడానికి మార్గం చూపాయి. ఆన్ లైన్ పార్టీ సభ్యత్వ అవకాశం కల్పించడంతో ప్రస్తుతం త్రిపురలో బీజేపీకి నాలుగు లక్షల మంది సభ్యులు ఉండటం ఆసక్తి కర పరిణామం. 2009లో బీజేపీ సభ్యుల సంఖ్య కేవలం 10 వేలు మాత్రమే. సీపీఎంకు సోషల్ మీడియాలో చోటు లేకపోవడం తమకు అనుకూలించిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

బీజేపీ ఇలా ‘చలో పల్టాయి’ నినాదం

బీజేపీ ఇలా ‘చలో పల్టాయి’ నినాదం

మూడేళ్లలో 15 రోజుల కోసారి మొత్తం 52 మంది కేంద్ర మంత్రులు త్రిపురలో పర్యటించారు. మారుమూల ప్రాంతాలకు దూసుకెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని సునీల్ డియోధర్ చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే ‘చలో పల్టాయి' నినాదం ఇవ్వడం మరింత ఊపునిచ్చిందంటారు. ‘పేదలు మరణిస్తారు. సీఎం హెలికాప్టర్ లో ప్రయాణిస్తారు' అన్న నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని చెబుతారు. గండచెరలో మలేరియాతో 100 మంది బాలలు మరణించడంపై బీజేపీ చేసిన ప్రచారం సీపీఎంకు ప్రతికూలంగా మారింది. 20 ఏళ్ల తర్వాత తాము చేసే ప్రచారంతో సీఎం గతేడాది ఏప్రిల్ లో సీఎం మాణిక్ సర్కార్ రైలులో ప్రయాణం చేశారని బీజేపీ నాయకులు అంటున్నారు.

గిరిజన ప్రాంతాలకు సీపీఎం ఇలా దూరం

గిరిజన ప్రాంతాలకు సీపీఎం ఇలా దూరం

2008, 2013ల్లోనూ త్రిపుర ప్రజలు మార్పు కోసం సిద్ద పడినా.. కాంగ్రెస్ నాయకులు గట్టిగా పోటీనివ్వకపోవడానికి కారణం కాంగ్రెస్ హై కమాండ్ నుంచి మద్దతు లేదన్న విమర్శ ఉంది. దీనికి లెఫ్ట్ పట్ల బీజేపీ సానుకూల వైఖరే కారణమన్న విమర్శ ఉంది. దీంతో కాంగ్రెస్ త్రిపుర నేతల్లో పట్టుదల పెరిగింది. 2013 ఎన్నికల వేళ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చివరి క్షణంలో పర్యటన రద్దు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సీపీఎం గిరిజనులతో కలిసి పని చేసింది. కానీ ఏళ్ల విరామం తర్వాత కొండ ప్రాంతాల్లో సీపీఎంకు, ఇతర సంస్థలకు మధ్య దూరం పెరిగింది. ఇది ఐపీఎప్టీ వంటి సంస్థల ఏర్పాటుకు దారి తీసిందని బీజేపీ వాదిస్తోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 33 వేల ఓట్లతో 20 స్థానాల్లో ఓటమి పాలైంది. అదీ 65 ఓట్ల నుంచి రెండువేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఆ సీట్లలో ఓటమి పాలైంది.

ఇలా మోదీ జన్ ధన్ యోజనకు ప్రజాదరణ

ఇలా మోదీ జన్ ధన్ యోజనకు ప్రజాదరణ

ప్రజలు మార్పు కోసం సిద్ధమైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్న అనుమానం ప్రజల్లో పెరిగింది. ఇదే పరిస్తితి ఇప్పటికీ ఉన్నదని బీజేపీ నేతలు అంటున్నారు. దశల వారీగా బీజేపీ త్రిపురలో ప్రయాణం సాగిస్తున్నది. రాష్ట్ర జనాభాలో 67 శాతం మంది బీపీఎల్ వారే. వారిలో 20 శాతం మందికి ఇప్పటికీ కార్డులు లేవు. సీపీఎంతో అనుబంధం గల వారికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. దీంతో ప్రధాని మోదీ ప్రారంభించిన జన్ ధన్ యోజనకు త్రిపురలో మంచి స్పందన వచ్చిందని సునీల్ డియోధర్ చెప్తారు. ఒకవైపు మాణిక్ సర్కార్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతకు తోడు మరోవైపు కేంద్రం విధానాలపై ప్రచారం స్పీడ్ పెంచడంతో పరిస్తితిలో మార్పు వచ్చిందన్నారు.

న్రుపేన్ చక్రవర్తిపై అభిమానం పెంచుకున్న సునీల్ డియోధర్

న్రుపేన్ చక్రవర్తిపై అభిమానం పెంచుకున్న సునీల్ డియోధర్

ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేసినా.. ట్విప్రాలాండ్ కోసం పోరాడుతున్నఆ సంస్థ వైఖరితో బీజేపీ ఏకీభవించడం లేదన్నారు. ఆరో షెడ్యూల్‌కు సవరణ ద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని త్రిపుర వాసులకు బీజేపీ హామీ గుప్పిస్తోంది. మాణిక్ సర్కార్ పేద సీఎం అని మీడియాలో వార్తలొచ్చాయని, కానీ ఆయన నెలవారీ విమాన ప్రయాణ ఖర్చులే రూ.10 కోట్లు ఉంటుందని చెప్పారు. కానీ త్రిపురలో పేద సీఎం అంటే న్రుపేన్ చక్రవర్తి మాత్రమేనన్నారు. ఆయన సిద్దాంతాలతో విభేదించినా ఆయనంటే అభిమానం అని సునీల్ డియోధర్ తెలిపారు. న్రుపేన్ చక్రవర్తి మాత్రమే నిజమైన మార్క్సిస్టు అని, మాణిక్ సర్కార్ కేవలం షో మాత్రమే చేస్తున్నారని, ఆయన జీవన విధానం వేరు అని ఆరోపించారు.

English summary
Agartala: The Bharatiya Janata Party (BJP) may have been contesting assembly elections in Tripura for years, but not only has it failed to open its account in the 60-member House, rarely have its candidates managed to even retain their deposits.With a vote share of 1.54% in the 2013 assembly elections against the incumbent CPI (Marxist)’s 48.11%, it should have been a foregone conclusion that the BJP holds no chance in the state’s February 18 assembly polls. And yet, across Tripura, BJP is being talked about as the possible winner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X