వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో శిక్షణ పొందిన షార్ప్ షూటర్: శశికళకు షాకిచ్చిన రూప ఎవరు?

బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, అధికారులకు రెండు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించి సకల సౌకర్యాలను, రాజభోగాలనూ అనుభవిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, అధికారులకు రెండు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించి సకల సౌకర్యాలను, రాజభోగాలనూ అనుభవిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

చూసిందే రాశాను, అది కూడా ఖైదీల నుంచి విన్నదే: శశికళ రాజభోగాలపై రూపచూసిందే రాశాను, అది కూడా ఖైదీల నుంచి విన్నదే: శశికళ రాజభోగాలపై రూప

ఈ మేరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్రిజన్స్ రూపా మోడ్గిల్ నివేదిక ఇచ్చారు. ఆమె ఇచ్చిన నివేదికను జైళ్ల శాఖ డిజిపి ఖండించారు. అయితే, శశికళకు తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలనూ కల్పించలేదని తెలిపారు.

 Meet the firebrand top cop who exposed Sasikala's VVIP treatment in Bengaluru jail

రూప తప్పుడు నివేదికను ఎందుకు ఇచ్చారో తనకు తెలియదని అన్నారు. తాను రూ. రెండు కోట్లు తీసుకున్నానని ఆమె ఇచ్చిన నివేదిక సత్య దూరమన్నారు. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు.

రూప ఇచ్చిన నివేదిక మాత్రం సంచలనం రేపింది. రూప కర్నాటకలోని దావణగెరెకు చెందిన ఐపీఎస్ అధికారిణి. 2000వ సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షలమలో రూప 43వ ర్యాంకు పొందారు. హైదరాబాదులో శిక్షణ తీసుకున్నారు.

అప్పుడు తన బ్యాచులో ఆమె అయిదో స్థానంలో నిలిచారు. కర్నాటక కేడర్‌కు అలాట్ చేశారు. రూప షార్ప్ షూటర్. ఎన్‌పిఏలో ఆమె పలు అవార్డులు దక్కించుకున్నారు. 26 జనవరి 2016లో ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ అవార్డు పొందారు.

ఆమె భరతనాట్యం డ్యాన్సర్. హిందుస్తానీ మ్యూజిక్‌లోను ప్రావీణ్యురాలు. అల్లర్ల కేసులో కోర్టు ఆర్డర్ అనంతరం గతంలో ఎస్పీగా ఉన్న రూప అప్పటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతిని అరెస్టు చేశారు. బెంగళూరు డిసిపిగా ఉన్న సమయంలో అనధికారికంగా వివిఐపి రాజకీయ నాయకులకు ఉన్న పోలీసులను తొలగించారు.

English summary
D Roopa, an IPS officer from Davangere, Karnataka exposed the sham running in the Bengaluru Parappana Agrahara Central jail and remains defiant in the face of controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X