వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్ఫూర్తిదాయకం: పూర్తిగా కోలుకున్నా..మళ్లీ సేవలందిస్తా: వారికి చికిత్స చేసిన నర్సు రేష్మా

|
Google Oneindia TeluguNews

కొట్టాయం: కరోనా మహమ్మారి దేశంపై పంజా విసురుతోంది. ఈ మాయదారి రోగం మనుషులను మనుషులకు కాకుండా చేస్తోంది. ఇది సోకిన వారికి దగ్గరలో ఉండకూడదు. దూరాన్ని పాటించాలి. వారిని ఎంత దూరంగా ఉంచితే మన ప్రాణాలకు అంత సేఫ్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కానీ ఈ విపత్కర సమయంలో నిజమైన హీరోలు మాత్రం వైద్య సిబ్బందే అని చెప్పక తప్పదు. అది అందరం అంగీకరించాల్సిన విషయం. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్ సోకిన పేషెంట్లను చికిత్స చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ఇప్పటికే కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ మహమ్మారిని జయించారు కూడా. అలాంటి వారిలో రేష్మ మోహన్ దాస్ అనే ఈ నర్సు గురించి అందరం తెలుసుకోవాల్సిందే.

 ఏపీ కరోనా క్వారంటైన్: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, మెనూ ఇదే..! ఏపీ కరోనా క్వారంటైన్: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, మెనూ ఇదే..!

 వృద్ధ దంపతులకు కరోనా

వృద్ధ దంపతులకు కరోనా

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు థామస్, మరియు మరియమ్మ. వీరికి కరోనా వైరస్ సోకింది. దేశంలో కరోనావైరస్ సోకిన అత్యంత పెద్ద వయస్సున్న దంపతులు వీరు. థామస్ వయస్సు 93 ఏళ్లు ఉండగా... మరియమ్మకు 88 ఏళ్లు. వీరిద్దరూ కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇక అసలు స్టోరీలోకి వద్దాం. ఈ ఇద్దరికీ ఈ కథలో దేవతలా అనిపించే రేష్మ మోహన్‌దాస్ నర్సింగ్ కేర్ అందించింది.

నర్సింగ్ కేర్ ఇచ్చిన రేష్మకు కరోనా పాజిటివ్

నర్సింగ్ కేర్ ఇచ్చిన రేష్మకు కరోనా పాజిటివ్

జనవరి 28న థామస్ మరియు మరియమ్మలు పూర్తిగా కోలుకున్నారనే గుడ్ న్యూస్ వచ్చింది. అప్పటి వరకు మనదేశంలో ఇంకా ఈ కరోనా వైరస్ పూర్తి స్థాయిలో వ్యాపించలేదు. ఇక 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని భావించి రేష్మ తన ఇంటికి వెళ్లింది. అక్కడే ఆమెకు కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత పాజిటివ్‌ అని తేలింది. ఇక అప్పటి నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకున్న రేష్మ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఇక హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అవుతూ త్వరలోనే వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతానని చెబుతూ ఇంటికి వెళ్లింది. ఇక రేష్మ ఆ వృద్ధ దంపతులకు నర్సింగ్ కేర్‌పై తన అనుభవాలను పంచుకుంది.

 మాటలతోనే వారికి దగ్గరయ్యాను

మాటలతోనే వారికి దగ్గరయ్యాను


థామస్, మరియమ్మలకు తొలి కాంటాక్ట్ తానే అని రేష్మ చెప్పుకొచ్చింది. అయితే వారు చాలా భయపడ్డారని గుర్తుచేసింది. వైరస్ సోకినంత మాత్రాన చనిపోరని దీని గురించి భయపడాల్సిన పనిలేదని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్లు రేష్మ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే చికిత్స సమయంలో థామస్‌కు గుండెపోటు కూడా వచ్చిందని ఆమె చెప్పారు. ఇక తొలి రోజునుంచే వృద్ధ దంపతులకు అదనపు కేర్ అవసరమని భావించిన రేష్మ చక్కగా కబుర్లు చెబుతూ వారి హృదయాలకు దగ్గరైంది.

చిన్న పిల్లల్లా మారాం చేసేవారు..

చిన్న పిల్లల్లా మారాం చేసేవారు..

ముందుగా వారికి వ్యాధి గురించి చెప్పడం చాలా కష్టమైందని రేష్మ చెప్పారు. ఆ తర్వాత వారికి ఆహారం ఇవ్వడం మరింత కష్టమైందని గుర్తుచేశారు. చిన్నపిల్లల్లా థామస్ దంపతులు ఇంటికి వెళ్లాలని మారాం చేసేవారని చెప్పారు. అంతేకాదు దోశ తప్ప మరొకటి తినం అని అలిగేవారని రేష్మ గుర్తుచేసుకున్నారు. ఇక గంటల కొద్దీ వారితో మాట్లాడటం ప్రారంభించి వారికి దగ్గరైనట్లు రేష్మ చెప్పింది. ఇక ఐసీయూలో వారు చికిత్స పొందుతున్నప్పుడు తానే వారి అవసరాలన్నీ చూసినట్లు గుర్తుకు చేసుకుంది.

డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధం

ఇక కేరళ ముఖ్యమంత్రి నుంచి ఆరోగ్య శాఖ మంత్రి వరకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారని రేష్మ చెప్పుకొచ్చింది. అంతేకాదు పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసి ఆరోగ్యశాఖ మంత్రి శైలజ మాట్లాడం నిజంగా అభినందనీయమని పేషెంట్లలో ధైర్యాన్ని భరోసాను నింపుతుందని రేష్మ చెప్పుకొచ్చారు. ఈ మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇళ్లకే పరిమితమై ఉండి సురక్షితంగా ఉండాలని చెబుతోంది రేష్మి. త్వరలోనే డ్యూటీలో జాయిన్ అయి మళ్లీ కరోనావైరస్ పేషెంట్లకు నర్సింగ్ కేర్ అందించేందుకు వస్తానని బలంగా చెబుతోంది.

Recommended Video

Trump's U Turn, Praises Modi And India But India Will Do Everything With Humanity

English summary
Reshma Mohandas has recovered from COVID-19 and is raring to go back to work. This 32-year-old nurse from Kerala’s Kottayam nursed the country’s oldest COVID-19 patients back to health, only to be infected by the virus herself. But that has not dampened her spirits and she wants to jump right back in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X