వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్ 2018-19: మోడీ ప్లాన్, జైట్లీ, బడ్జెట్ తయారు చేసిన మాస్టర్ మైండ్స్ వీరే !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2018 : People Perform rayers, Appeal To PM Modi Ahead

న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కారు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2018-19 ఏడాది బడ్జెట్ తయారు చెయ్యడానికి పెద్ద కసరత్తు జరిగింది. ఎన్డీయే సర్కారుకు చివరికి బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపించింది. 2019లో సాధారణ ఎన్నికలతో పాటు ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2018-19 మీద ప్రత్యేక శ్రద్ద చూపించింది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తయారు చేసిన వారిలో మాస్టర్ మైండ్స్ అధికారులు ఉన్నారు.

 జీఎస్ టీ తరువాత మోడీ, జైట్లీ !

జీఎస్ టీ తరువాత మోడీ, జైట్లీ !

కేంద్రం గత ఏడాది అమల్లోకి తీసుకు వచ్చిన జీఎస్ టీ తరువాత ప్రవేశ పెట్టిన బడ్జెట్ తయారు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక శ్రధ్దపెట్టారని వెలుగు చూసింది. పలు శాఖల అధికారులతో చర్చించి తయారు చేసిన 2018-19 బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి (2018) అమలులోకి రానుంది.

అధికారులకు వేరే విషయాల్లో !

అధికారులకు వేరే విషయాల్లో !

ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రైల్వే శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో చర్చించిన తరువాత బడ్జెట్ రూపోందించే పనిలో నిమగ్నం అవుతారు. బడ్జెట్ తయారు చేసే పని ముగిసే వరకూ అధికారులు వేరే విషయాలపై దృష్టి పెట్టరు.

నార్త్ బ్లాక్ లో బడ్జెట్

నార్త్ బ్లాక్ లో బడ్జెట్

లోక్ సభలోని నార్త్ బ్లాక్ లో బడ్జెట్ తయారు చేస్తారు. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ప్రకారం హల్వా తయారు చేసి ఆరగించిన తరువాత బడ్జెట్ తయారు చెయ్యడానికి అధికారులు సిద్దం అవుతారు. బడ్జెట్ తయారు చేసి వాటిని ముద్రించి లోక్ సభలో ప్రవేశ పెట్టిన తరువాత అధికారులు నార్త్ బ్లాక్ నుంచి బయటకు వస్తారు.

అధికారులకు అన్నీ దూరం

అధికారులకు అన్నీ దూరం

బడ్జెట్ తయారు చేసే అధికారులు ఉంటున్న గదుల్లోని కంప్యూటర్ల నుంచి వేరే కంప్యూటర్లకు సంబంధం ఉండదు. ఇంటర్నెట్ సౌకర్యం పూర్తిగా నిలిపివేస్తారు. బడ్జెట్ తయారు చేసే అధికారులు కనీసం వారి కుటుంబ సభ్యులతో సంప్రధించడానికి ఫోన్ సౌకర్యం కూడా ఉండదు. నార్త్ బ్లాక్ నుంచి సౌత్ బ్లాక్ వెళ్లడానికి ఎలాంటి అవకాశం ఉండదు. లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టి పూర్తి చేసిన తరువాతే వాటిని తయారు చేసిన అధికారులను నార్త్ బ్లాక్ నుంచి బయట ప్రపంచంలోకి పంపిస్తారు.

 బడ్జెట్ మాస్టర్ మైండ్స్ !

బడ్జెట్ మాస్టర్ మైండ్స్ !

కేంద్ర ఆర్థిక, రెవెన్యూ శాఖ కార్యదర్శి డాక్టర్ హస్ముఖ్ అధియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక శాఖ సీనియర్ అధికారి రాజీవ్ కుమార్, బడ్జెట్ విభాగం జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ గోయల్, సీబీటీడీ, సీబీఇసీ శాఖల అధికారులు, ఆర్థిక శాఖలోని 34 మంది సీనియర్ అధికారులతో సహ మొత్తం 120 మంది అధికారులు 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారు చేశారు.

మోడీ ప్లాన్, జైట్లీ అమలు

మోడీ ప్లాన్, జైట్లీ అమలు

2018లో కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, నాగాల్యాండ్, మేఘాలయ, త్రిపురాతో సహ 8 రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వెయ్యాలని ప్లాన్ వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలతో పక్కా ప్లాన్ తో తయారు చేసిన బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు.

English summary
While all eyes will be on the upcoming government schemes and announcements, not many know about the team that has drafted the Union Budget 2018. Here’s a look at the key players involved in the preparation of this year’s budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X