• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడే: 'ఒక్క ఫోటో' అతని జీవితాన్నే మార్చేసింది..

|

త్రిసూర్: సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. పాట, డ్యాన్స్, డైలాగ్, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ.. ఇలా ఏదైనా కావచ్చు.. ఒక్కసారి సోషల్ మీడియా వేదిక తమ టాలెంట్ బయటపెట్టారంటే ఓవర్ నైట్ దేశం దృష్టి వారిపై పడుతోంది.

ఇటీవలి కాలంలో అచ్చు ఇలాగే దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించాడు ఓ ఫోటోగ్రాఫర్. వెడ్డింగ్ షూట్ కోసం అతను చేసిన సాహసం.. చివరకు అతన్ని ఓ స్టార్ ను చేసింది. దీంతో ఇబ్బడిముబ్బడిగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయట.

ఇంతకీ అతనేం చేశాడు?

కేరళలోని త్రిసూర్ 'వైట్ ర్యాంప్' అనే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ గ్రూపులో విష్ణు ఒక సభ్యుడు. ఏప్రిల్ 15న త్రిసూరులో 'షియాజ్-నవ్య'ల పెళ్లిని కవర్ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు కొత్తగా ట్రై చేద్దామని.. కొత్త జంటను చెట్టు కింద తలకిందులుగా నిలబెట్టి.. చెట్టుపై అతను తలకిందులుగా వేలాడుతూ ఫోటోలు తీశాడు.

అతను తీసిన ఫోటోలు అద్భుతంగా రావడం.. అతనలా చెట్టుకు వేలాడుతూ ఫోటోలు తీస్తుంటే మరొకరు వీడియో తీయడం.. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా ఎవరా ఫోటోగ్రాఫర్? అన్న చర్చ మొదలైంది. అలా మనోడు ఓ సెలబ్రిటీ అయిపోయాడు. త్రిసూర్ ఫోటోగ్రాఫర్స్ గ్రూపులో ఆ ఫోటోలను షేర్ చేయడం.. అక్కడినుంచి అవి సోసల్ మీడియా అంతా పాకినట్టు తెలుస్తోంది.

గబ్బిలం ఫోటోగ్రాఫర్

చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఫోటోలు తీసి ఫేమస్ అయిపోయిన విష్ణుని.. ఇప్పుడు అక్కడివారంతా 'గబ్బిలం ఫోటోగ్రాఫర్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారట. తాను ఇంత ఫేమస్ అయిపోవడంపై స్పందించిన విష్ణు.. నిజానికి ఇంతకుముందు కూడా చెట్లెక్కి తాను ఫోటోలు తీశానని, చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడిన అనుభవం తనకు కలిసొచ్చిందని నవ్వుతూ చెప్పాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They say one needs to work hard in order to reach great heights. But for Thrissur native Vishnu, a photographer by profession, this saying turned out to be literally true. Vishnu climbed a tree in pursuit of the perfect frame and a video of his acrobatic skills made him famous overnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more