• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైద్యుల డిమాండ్లకు దీదీ ఓకే : రక్షణ కల్పిస్తాం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు అంగీకారం

|

కోల్‌కతా : ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లతో చర్చలు విజయవంతమయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేయడంతో గొడవ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో జూనియర్ వైద్యులు నిరసన తెలుపడం .. దేశవ్యాప్తంగా వైద్యులు మద్దతు తెలుపడంతో బెంగాల్ సర్కార్ దిగొచ్చి చర్చలు జరిపింది.

డిమాండ్లకు ఓకే ..

డిమాండ్లకు ఓకే ..

ఎన్ఆర్ఎస్ ఆస్పత్రి వైద్యులతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన కార్యాలయం నబన్నలో చర్చలు జరిపారు. వారి డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మమతా స్పష్టంచేశారు. వారు కోరిన సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని మమత హామీనిచ్చారు. దీంతో ప్రభుత్వ ప్రకటనతో జూనియర్ వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో మీకేమైనా సమస్య ఉంటే తనతో నేరుగా చెప్పాలని .. లేదంటే తన నివాసంలో గల డ్రాప్ బాక్స్‌లో లేఖ రాసి వేయాలని సూచించారు. ప్రజలు అందించే లేఖలను తాను ప్రతిరోజు చేస్తానని పేర్కొన్నారు.

రక్షణ కల్పిస్తాం ..

రక్షణ కల్పిస్తాం ..

ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల రక్షణ కోసం నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని పోలీసుశాఖను ఆదేశించినట్టు మమత స్పష్టంచేశారు. సమావేశంలో వైద్యులు తమ ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వివరించారు. అంతేకాదు మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో సరైన రక్షణ లేక భయపడుతున్న పరిస్థితి ఉందని గుర్తుచేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెంగాల్ ఆరోగ్యశాఖ కార్యదర్శి చంద్రిమ భట్టాచ్చార్య. ఇతర ఉన్నతాధికారులు .. 31 మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.

పరిమితంగా మీడియా ..

పరిమితంగా మీడియా ..


సమావేశానికి బెంగాల్ ప్రభుత్వం మీడియాను పరిమితంగా అనుమతిచ్చింది. కేవలం రెండు స్థానిక వార్త సంస్థలను మాత్రమే సమావేశంలోకి ఆహ్వానించింది. అంతేకాదు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ఏ వైద్యునిపై కూడా కేసు నమోదు చేయలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. వైద్యులు విధుల్లోకి రాకుంటే ఎస్మా చట్టం ప్రయోగిస్తామనే సంకేతాలను ఇచ్చింది బెంగాల్ సర్కార్. అయితే వారు మొండిగా ఉండటంతో .. చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు కృషిచేసింది. అంతేకాదు జూనియర్ వైద్యులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేస్తామని భరోసానిచ్చింది.

 ఏం జరిగిందంటే ..

ఏం జరిగిందంటే ..

గత సోమవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో రోగి బంధువులు బీభత్సం సృష్టించి నంగతి తెలిసిందే. తమ బంధువు చనిపోవడానికి జూనియర్ డాక్టర్లు పరిబర ముఖపాధ్యాయ్, యాష్ కారణమని దాడిచేశారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో నానా హంగామా చేశారు. ముఖపాధ్యాయ తలపై వెనక నుంచి ఇటుకపెళ్లతో దాడిచేయడంతో పుర్రె ఎముక విరిగింది. దీంతో తొలుత ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత పార్క్ సైన్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులపై దాడిని నిరసిస్తూ ఎన్ఆర్ఎస్ డాక్టర్లు నిరసన చేపట్టారు.

English summary
west Bengal chief minister Mamata Banerjee has declared that her hour-long meeting with protesting doctors was "successful". Coming out of the CMO at Kolkata's Nabanna, Mamata Banerjee said that the meeting with the doctors, who have been protesting for a week, was successful. The protesting doctors also echoed the same sentiment, saying they were satisfied with the outcome of the meeting. Ending the meeting on a reconciliatory note, Mamata Banerjee told the junior doctors, "If you are ever in problem, drop a letter in Kalighat. I always see the documents at home. I run an office at my residence in Kalighat."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X