వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేఘాలయ: రెండు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ సీఎం సంగ్మా

|
Google Oneindia TeluguNews

షిల్లాంగ్‌: మేఘాలయ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ సంగ్మా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంపాతి, సంగ్సక్ నియోజవర్గాల నుంచి బరిలోకి దిగిన సంగ్మా జయకేతనం ఎగురవేశారు.

ఈశాన్య మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే, ఎలాగంటే?: కిరణ్ రిజిజు, సంబరాలుఈశాన్య మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే, ఎలాగంటే?: కిరణ్ రిజిజు, సంబరాలు

మేఘాలయకు సంగ్మా రెండు పర్యాయాలు సీఎంగా చేశారు. తొలిసారి 2010 ఏప్రిల్‌లో మేఘాలయ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ముకుల్ సంగ్మా.. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

Meghalaya CM Mukul Sangma wins from both seats

కానీ, ఈసారి మాత్రం మేఘాలయలో హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సూచనలు లేవు.

మధ్యాహ్నం సమయానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 2 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్‌పీపీ 16 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, బీజేపీ ఇక్కడ కేవలం 4 స్థానాలు నెగ్గేలా కనిపిస్తోంది. అయితే, ఎన్పీపీ, ఇతర పార్టీలతో కలిసి తామే అధికారం ఏర్పాటు చేస్తామని బీజేపీ స్పష్టం చేసింది.

English summary
Meghalaya chief minister and Congress candidate Mukul Sangma wins from both Ampati and Songsak constituencies, EC sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X