వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేఘాలయలో యువత ఓటే కీలకం.. ముకుల్ సంగ్మాపై కుర్రకారు భగ్గు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Meghalaya Assembly Polls 2018 Update | Oneindia Telugu

షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం పోలింగ్ జరుగనున్నది. 60 స్థానాల అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఈ దఫా 18 - 19 ఏళ్ల మధ్య వయస్కులే ప్రధానం కానున్నారు. తొలిసారి ఓటేయనున్న వీరు సుమారు 45 వేల మంది రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ముకుల్ సంగ్మా పనితీరుపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అభిలషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
మేఘాలయలో ఎక్కువ శాతం మంది యువత మార్పుకే ఓటేయాలని నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. కాగా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందని అంచనా వేస్తున్నారు. ఇక లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా వారసులు కన్రడ్ సంగ్మా, అగథా సంగ్మా గెలుపొందాలని ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీయేతర ఓట్లు చీలకుంటే బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలు విజయం సాధిస్తాయని చెప్తున్నారు.

ఇతర పార్టీల పోటీతో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి

ఇతర పార్టీల పోటీతో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి

షిల్లాంగ్‌లోని సెయింట్ ఎడ్మండ్ కళాశాలలో బీకాం నాలుగో సంవత్సరం విద్యార్థి ఐబియాన్ మార్బానియాంగ్ ఈ దఫా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉన్నదన్నారు. అయితే తాను ఎటు ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ‘బీజేపీ మంచి పార్టీ అని నేను ఒప్పుకుంటున్నా. చాలా చురుగ్గా ఉన్న పార్టీ అది ఒక్కటే. దేశంలో చాలా మార్పులు తెచ్చింది. నేను ఆ పార్టీకే ఓటేయవచ్చు' అని పేర్కొన్నారు. కానీ మేఘాలయలోని 60 స్థానాలకు కేవలం 47 స్థానాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేస్తోంది. బీజేపీ, నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), యూడీపీ - హెచ్ఎస్పీడీపీ కూటమి మధ్య ఓట్లు చీలిపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందుతుందని ఐబియాన్ మార్బానియాంగ్ అభిప్రాయ పడ్డారు.

ఎన్పీపీ, బీజేపీ, యూడీపీ - హెచ్ఎస్పీడీసీ మధ్య రహస్య అవగాహన

ఎన్పీపీ, బీజేపీ, యూడీపీ - హెచ్ఎస్పీడీసీ మధ్య రహస్య అవగాహన

బీజేపీ ఈ దఫా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నదని, బీజేపీకి ఎన్పీపీతోనూ యూడీపీ - హెచ్ఎస్పీడీపీ కూటమిలతో రహస్య అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మూడు పక్షాల మధ్య రహస్య ఒప్పందం కనుక కుదిరితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశమే లేదంటున్నారు. ఐబియాన్ సహ విద్యార్థి క్యాండీ మాజావ్ మాత్రం ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. రాజకీయాలంటేనే పూర్తిగా అవినీతిమయం అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా నిధులు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కొందరు తప్పనిసరిగా డబ్బు ఖర్చు చేస్తారని ఆమె ఘంటాపథంగా చెప్తున్నారు. ఏ పార్టీ గెలుపొందినా అవినీతి తప్పక ఉంటుందని క్యాండీ పేర్కొనడం గమనార్హం.

బీజేపీ మద్దతు ఉంటేనే కేంద్రం నిధులు

బీజేపీ మద్దతు ఉంటేనే కేంద్రం నిధులు

ఆలీస్టయిన్ నాంగ్బ్ర్రిహ్ అనే బీఏ సెకండియర్ విద్యార్థి మాత్రం నూతన ప్రభుత్వంపై ఆశాభావంతో ఉన్నాడు. తాను ప్రభుత్వ మార్పుకే ఓటేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విపలమైందన్నాడు. ఉపాధి కల్పనలోనూ, ఉద్యోగ ప్రాతిపదికన విద్యాబోధన కల్పించడంలోనూ, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలోనూ విఫలమైందని ఆరోపించాడు. మేఘాలయలో బీజేపీ మద్దతుతో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకు రాగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు

మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు

సెయింట్ మేరీస్ కాలేజీ బీఎస్పీ విద్యార్థి మార్బా ఖోంగ్వార్ మాట్లాడుతూ తాను తొలిసారి ఓటేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ప్రజాతంత్ర ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. తన ఓటు ప్రభుత్వ మార్పుకే ఉంటుందన్నారు. కానీ మేఘాలయలో మాతృస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యం ఉన్నా మహిళలు, యువతులు, బాలికలకు భద్రత లేకపోవడం నిరాశగా ఉన్నదని తెలిపారు. ‘ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై నేరాలు జరిగిన వార్తలు చదువుతుంటాం. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిస్సహాయురాలిపై లైంగిక దాడికి యత్నించినందుకు గతేడాది ఒక ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు‘ అని ఆమె గుర్తు చేశారు.

కాంగ్రెసేతర పార్టీల ఓట్లు చీలొద్దని సూచనలు

కాంగ్రెసేతర పార్టీల ఓట్లు చీలొద్దని సూచనలు

మార్బా ఖోంగ్వార్ స్నేహితురాలు మార్గరేట్ లింగ్డో మాత్రం ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుతున్నారు. ‘నేను కన్రడ్ సంగ్మా, ఆయన సోదరి అగథా సంగ్మా అంటే ఇష్ట పడతాను. వారు సమర్థులు, యువకులు. నేను హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి వారి తండ్రి పీఏ సంగ్మా అంటే ఎంతో ఇష్టం. ఎన్పీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుందని భావిస్తున్నా. ఆ రెండు పార్టీలో మణిపూర్, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు. కాంగ్రెసేతర ఓట్లు చీలకుండా వారు జాగ్రత్తలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నిస్తున్న యువత

ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నిస్తున్న యువత

డాజైడ్లాంగ్ కాంగ్వాంగ్ అనే బీఏ సెకండియర్ విద్యార్థి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యేలెవరూ ప్రజలు చేసిందేమీ లేదన్నారు. తన స్నేహితులకు ఉద్యోగాలు కల్పించారా? తాము విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని 160 కిమీ దూరం నుంచి వచ్చి షిల్లాంగ్ పట్టణంలో చదువుకుంటున్న విద్యార్థి.. తమ ప్రాంతంలో ఒక్క కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మేఘాలయ అంతటా రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమీ చేయనప్పుడు ఆ పార్టీకి తానెందుకు ఓటేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అత్యధిక డ్రాపౌట్లు ఉన్నాయని యువత ఆందోళన

అత్యధిక డ్రాపౌట్లు ఉన్నాయని యువత ఆందోళన

అఫ్రిద్ అహ్మద్ అనే బీఏ విద్యార్థి మాట్లాడుతూ తాను యూనివర్సిటీ డిగ్రీ పుచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో చేరిపోతానని ప్రకటించారు. తాను మార్పు కోసమే ఓటేస్తానన్నారు. కానీ తనకు ఇప్పటివరకు సరైన అభ్యర్థే కనిపించలేదన్నారు. భావి తరాల కోసం వారు చేసిందేమిటని ఆమె ప్రశ్నించారు. ఆఫ్రిన్ తల్లి ఖాసీ మాట్లాడుతూ చాలా మంది రాష్ట్ర బాలలు బడులకు వెళ్లడం లేదన్నారు. మేఘాలయలో అత్యధిక డ్రాపౌట్లు ఉన్నాయని తెలిపారు. పోలీస్ బజార్ తదితర ప్రాంతాల్లో కనీసం ఆరేడు మంది బాలలు సిగరెట్లు, బీడీలు, గుట్కా విక్రయిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
There are around 1 lakh new voters in Meghalaya in this election slated for February 27. Of them, around 45,000 are first-time voters in the age group 18-19. Aibian Marbaniang, a B Com fourth semester student of St Edmund’s College, is thrilled about casting her vote for the first time on February 27. But then, she is not sure whether the party she wants to vote for will be able to come to power in Meghalaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X