వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ను సందర్శించకండి .. మేఘాలయ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామా దాడి తర్వాత జవాన్లకు మద్దతుగా జాతి మొత్తం నిలిచింది. కానీ కొందరు నేతల కాంట్రవర్సీ కామెంట్లు మాత్రం కొనసాగుతోన్నాయి. ఉగ్రవాదులకు మతం, దేశంతో సంబంధం లేదని కాంగ్రెస్ నేత సిద్దూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కశ్మీరీ వస్తువులను నిషేధించండి
పుల్వామాలో వీర మరణం పొందిన 40కి పైగా జవాన్లను స్మరించుకొని కశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు రాయ్. కశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని .. అలాగే సందర్శన కోసం కశ్మీర్ వెళ్లొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Meghalaya Governor Tathagata Roy asks people to boycott everything Kashmiri

అమర్ నాథ్ కూడా వెళ్లొద్దు ...
కశ్మీరే కాదు అమర్ నాథ్ యాత్రకు కూడా వెళ్లొద్దని ట్వీట్ చేశారు. రెండేళ్ల వరకు అక్కడికి పోవద్దని .. ఆ తర్వాత వెళ్లాలని సూచించారు. అలాగే శీతకాలంలో కశ్మీర్ వర్తకులు విక్రయించే వస్తువులను బ్యాన్ చేయాలని కోరారు. ఉగ్ర దాడి నేపథ్యంలో ఇది మనం చేస్తున్న అహింస పద్దతి అని ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో శివసేన ఎమ్మెల్సీ మనీశా కూడా కశ్మీర్ పర్యటనను రెండేళ్లు బహిష్కరించాలని కోరిన సంగతి తెలిసిందే.

English summary
Against the backdrop of the Pulwama terrorist attack that claimed lives of 40 CRPF personnel, Meghalaya Governor Tathagata Roy on Wednesday asked the people to boycott Kashmiri goods and also urged people not to visit Kashmir. Taking to Twitter, Tathagata Roy said,''An appeal from a retired colonel of the Indian Army: Don't visit Kashmir,don't go to Amarnath for the next 2 years. Don't buy articles from Kashmir emporia or Kashmiri tradesman who come every winter. Boycott everything Kashmiri.''
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X