• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సింది: హైకోర్టు జడ్జి, అసదుద్దీన్ స్పందన

|

షిల్లాంగ్: మేఘాలయ హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఇక్కడి హైకోర్టు జడ్జి సుదీప్ రంజన్ సేన్ హిందూ నేషన్ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం సోదరులకు తాను వ్యతిరేకం కాదనీ, వాళ్లంతా దశాబ్దాలుగా చట్టాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నారని, కానీ జనాభా రీత్యా భారత్‌ను ఇప్పటికే హిందూ దేశంగా ప్రకటించి ఉండాల్సిందన్నారు.

<strong>ఐటీ కారిడార్‌లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ, సుహాసినికి సీమాంధ్రులు షాకిచ్చారు</strong>ఐటీ కారిడార్‌లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ, సుహాసినికి సీమాంధ్రులు షాకిచ్చారు

దేశ విభజన అనంతరం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుందనీ, భారతదేశం కూడా హిందూ రాజ్యంగా ప్రకటించకోవాల్సి ఉండెనని వ్యాఖ్యానించారు. కానీ అప్పటి పాలకులు ప్రజాస్వామ్య, లౌకిక దేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఓ వ్యక్తికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేయడానికి అధికారులు నిరాకరించిన కేసులో ఆయన ఈ మేరకు స్పందించారు.

 నాటి ప్రభుత్వం హిందువులకు పునరావాసం కూడా కల్పించలేదు

నాటి ప్రభుత్వం హిందువులకు పునరావాసం కూడా కల్పించలేదు

దేశ విభజన రక్తపాతంతో జరిగిందని సదరు జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కట్టుబట్టలతో ఆస్తులను వదులుకుని సిక్కులు, హిందువులు భారత్‌కు వచ్చారని చెప్పారు. అప్పటి ప్రభుత్వం హిందువుల పునరావాస కేంద్రాల గురించి పట్టించుకోలేదన్నారు. కాబట్టి భారత్‌కు స్వాతంత్ర్యం అహింసతో కాకుండా హింస, రక్తపాతంతోనే వచ్చిందన్నారు.

మోడీకి మమత మద్దతివ్వాలి

మోడీకి మమత మద్దతివ్వాలి

ఇప్పటీకీ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారత్ ఇస్లామిక్ దేశంగా మారేందుకు వీలులేదన్నారు. అలాంటి విపత్కర పరిణామాలు ఎదురుకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుకుంటారన్న నమ్మకం తనకు ఉందనీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ విషయంలో దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని సూచించారు. విదేశాల్లోని హిందువులకు భారత పౌరసత్వం దక్కేలా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్రానికి సూచన చేశారు.

ఖండించిన అసదుద్దీన్

ఖండించిన అసదుద్దీన్

జడ్జి వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ప్రభుత్వం, జ్యూడిషియరీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. జడ్జి ఇచ్చిన తీర్పు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లా ఉందని చెప్పారు. చట్టం, రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తులు రాసిన తీర్పులా అది కనిపించడం లేదన్నారు.

ఎప్పటికీ ఇస్లామిక్ దేశంగా మారదని నెటిజన్ ట్వీట్

ఎప్పటికీ ఇస్లామిక్ దేశంగా మారదని నెటిజన్ ట్వీట్

అసదుద్దీన్ ట్విట్టర్‌లో స్పందించారు. 'జడ్జి గారూ ఇంకో పని చేయాలి. మిత్రులారా... అని పిలిచేవారి భజన చేయడం కాకుండా తాను జడ్జి అవడానికి కారణమైన రాజ్యాంగాన్ని ఓసారి చదవాలి. జస్టిస్ సేన్ ఇచ్చిన తీర్పు నిజంగా రాజ్యాంగం, చట్టం తెలిసిన వ్యక్తి రాసినదానికంటే ఫార్వర్డ్ చేసిన ఓ వాట్సాప్ మెసేజ్ లాగా కనిపిస్తోంది' అని పేర్కొన్నారు. భారత్ సెక్యులర్ దేశమని, ఇది ఎప్పటికీ ఇస్లామిక్ స్టేట్‌గా మారదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను అసదుద్దీన్ రీట్వీట్ చేశారు.

English summary
Meghalaya High Court Judge Justice Sudip Ranjan Sen has sparked a massive controversy by lamenting in a judgement the fact that the stakeholders during the Partition did not declare India a Hindu nation. The judge also made an appeal to the Prime Minister and other parliamentarians to take steps to prevent India from turning into an Islamic country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X