వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీ!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయిూద్ (79) ఆనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన కుమార్తె మహబూబా మఫ్తీని తదుపరి ముఖ్యమంత్రిని చెయ్యడానికి పీడీపీ నాయకులు సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే ఈ విషయంపై పీడీపీ, బీజేపీ నాయకులు ఓ అవగాహనకు వచ్చారని తెలిసింది. చాలకాలం నుంచి ముఫ్తీ మహమ్మద్ సయిూద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కొంత వరకు కోలుకున్నా ముఖ్యమంత్రి భాద్యతలు నిర్వహించే స్థాయిలో లేరని గతంలో చర్చ జరిగింది.

ఆ సందర్బంలో పీడీపీ, బీజేపీ నాయకులు చర్చించి నెమ్మదిగా సీఎం పగ్గాలను మహబూబాకు అప్పగించాలని నిర్ణయించారు. మహబూబా విషయంలో పీడీపీ నాయకులలో వేరే ఆలోచనే లేదు. మహబూబా ముఫ్తీనే తమ నాయకురాలు అని అంటున్నారు.

Mehbooba Mufti set to be Jammu and Kashmir Chief Minister !

మహబూబాను సీఎం చెయ్యడానికి బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదు. జనవరి 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగవలసి ఉంది. ఇదే సమయంలో ముఫ్తీ మహమ్మద్ సయిూద్ మరణించారు. పీడీపీ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు.

గతంలో జరిగిన కొన్ని సమావేశాలలో ముఫ్తీ మహమ్మద్ సయిూద్ మాట్లాడుతూ తాను ప్రజలతో, పార్టీ నాయకులతో ఎక్కువ సమయం గడపడానికి వీలుకావడం లేదని అన్నారు. మహబూబా ముఫ్తీకి ప్రజలతో, పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

ఆమె ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ముఫ్తీ మహమ్మద్ సయిూద్ చెప్పారు. ముఫ్తీ మహమ్మద్ అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత పీడీపీ, బీజేపీ నాయకులు సమావేశం అయ్యి తుది నిర్ణయం తీసుకుంటారని జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయిూం అఖ్తర్ తెలిపారు.

English summary
Sayeed was suffering from a non-specific systemic infection, with the exact cause of the infection not being known.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X