వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా.. ఎట్టకేలకు విముక్తి.. ఏడాదికిపైగా నిర్భందం.. ముప్తీ విడుదల..

|
Google Oneindia TeluguNews

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ నేతల నిర్భందం కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా తదితరులను నిర్బంధించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి.. 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. స్వయంగా కశ్మీర్‌లో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారు. తర్వాత పరిస్థితులు మారడంతో క్రమంగా ఆంక్షలను తొలగించారు. షాపులు, స్కూళ్లు తెరచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఇప్పుడు నేతల నిర్భందం నుంచి విడుదల చేశారు.

Mehbooba Mufti to be released after spending more than a year in detention

మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మొహబూబా ముప్తీని నిర్భందం నుంచి విడుదలచేస్తున్నామని జమ్ముకశ్మీర్ అధికారులు తెలిపారు. ఈ మేరకు కశ్మీర్ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ ట్వీట్ చేశారు. ప్రజా భద్రత చట్టం కింద ముప్తీపై గల నిర్బంధాన్ని జూలైలో మరోసారి పొడగించారు. 3 నెలలు పొడిగంచగా.. పరిస్థితులు సద్దుమణగడంతో వెనక్కి తీసుకున్నారు. దీంతో ముప్తీపై గల నిర్భందం ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాపై కూడా నిర్భందం విధించారు. అయితే వారిపై మార్చి నెలలో డిటెన్షన్ ఎత్తివేశారు. ఇప్పుడు ముప్తీపై ఆంక్షలను తొలగించారు.

English summary
PDP chief Mehbooba Mufti to be released from detention said jammu kashmir administration spokesperson rohit kansal on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X