వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ స్పీకర్ మీరా కుమార్

ఊహించిన విధంగానే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌తో ఆమె తలపడనున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఊహించిన విధంగానే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌తో ఆమె తలపడనున్నారు.

కాగా, 2009-14 మధ్య కాలంలో మీరా కుమార్ లోకసభ స్పీకర్‌గా పనిచేశారు. అంతేగాక, కేంద్రమంత్రిగానూ ఆమె సేవలందించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తే ఈ మీరా కుమార్. ఆమె స్వస్థలం బీహార్ రాజధాని పాట్నా.

Meira Kumar is Opposition’s candidate for president

కాగా, గురువారం సాయంత్రం ఢిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో విపక్ష నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదట విపక్షాల తరఫున అభ్యర్థులుగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ల పేర్లు ప్రముఖంగా విన్పించాయి. కానీ, చివరకు మీరాకుమార్‌నే ఎంపిక చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, డీఎంకే నేత కనిమొళి తదితరులు పాల్గొన్నారు.

English summary
Opposition parties on Thursday announced that former Lok Sabha Speaker Meira Kumar was their pick for the next president, NDTV reported. The announcement came after the Congress and Left had denied that Kumar was in the running for the post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X