వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. కరెంట్ పోల్ ఎక్కి రచ్చ రచ్చ, పోలీసులకు తప్పని తిప్పలు

|
Google Oneindia TeluguNews

నోయిడా : అతనికి మతిస్థిమితం లేదు. చెట్టు అనుకున్నాడో ఏమో కానీ విద్యుత్ స్తంభం ఎక్కాడు. పైకెచ్చి ఎంచక్కా జనాలను చూస్తున్నాడు. దీంతో గాబరపడ్డ జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆ యువకుడిని క్షేమంగా కిందకి దించారు. పోలీసులను ముచ్చెమటలు పెట్టించిన ఈ ఘటన నోయిడాలో జరిగింది.

 వామ్మో పోల్ ఎక్కాడు ..

వామ్మో పోల్ ఎక్కాడు ..

బీహర్‌లోని బెతియా జల్లాకు చెందిన అనిరుద్ వయస్సు 26 ఏళ్లు. కానీ అతనికి మతిస్థిమితం. గత కొన్నాళ్ల నుంచి నోయిడాలోనే ఉంటున్నాడు. ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు కానీ .. ఇవాళ పోలీసులను ముచ్చెమటలు పట్టించాడు. ఇవాళ శివయం శివలిక్ మార్గ్ వద్ద వీధిలో ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. దాదాపు అరగంటపాటు స్తంభంపైనే ఉండడంతో అక్కడున్న వారు వణికిపోయారు.

హుటహుటిన వచ్చిన పోలీసులు

హుటహుటిన వచ్చిన పోలీసులు

స్థానికులు సమాచారం అందజేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయం తీసుకున్నారు. పైన ఉన్న అనిరుధ్‌కు నచ్చజెప్పారు. చివరికి ఎలస్ట్రిటీకి చెందిన క్రేన్ సాయంతో మెల్లిగా కిందకి దించారు. దీంతో పోలీసులే కాదు అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత సెక్టార్ 24 పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ అతనికి సంబంధించిన వివరాలను కనుగొన్నారు. అతనికి మతిస్థిమితం లేదని గుర్తించారు. అయితే అతను విద్యుత్ స్తంభం ఎందుకు ఎక్కాడో ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్తున్నారు.

హమ్మయ్య ...

హమ్మయ్య ...

మొత్తానికి సరైన సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి .. లోకజ్ఞానం తెలియని ఓ అమాయకుడిని క్షేమంగా రక్షించారు. ఎలక్ట్రిసిటీ క్రేన్ సాయంతో కిందకు దించారు. లేదంటే ప్రాణపాయం ఉండేది. పోలీసులు, సిబ్బంది పనితీరును స్థానికులు కొనియాడుతున్నారు.

English summary
26-year-old mentally-challenged man climbed up a street light pole in Noida on Monday, ensuing a ruckus that continued for at least half an hour, officials said. The incident occurred on Shivalik Marg, near Noida City Centre, and it was reported to the police around 8.30 am, the officials said. "Soon a police team from Sector 24 station reached the spot along with officials from the Fire department to bring him down. It was only after some 30 minutes that the man could be convinced and brought down safely with the help of a crane from the Electricity Department," a police official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X