వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ పిచ్చి.. మానసిక వికలాంగులను బలిచేసిన ఆ కాలనీ వాసులు

|
Google Oneindia TeluguNews

టిక్‌టాక్ వీడియో కోసం ఇద్దరు మానసిక వికలాంగులకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో చోటు చేసుకుంది. పాపం జరుగుతున్న తంతు గురించి తెలియని ఆ యువతి,యువకుడు అమాయకంగా నవ్వుతూ సెల్‌ఫోన్ కెమెరాల వైపు చూస్తుండిపోయారు.

మానసిక వికలాంగులైన ఆ ఇద్దరు ఒకే కాలనీలో ఉంటారు. కానీ ఒకరికొకరు తెలియదు. ఇటీవల కొంతమంది స్థానికులు వారిద్దరిని పట్టుకొచ్చి టిక్‌టాక్ వీడియో చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా వారిద్దరితో దండలు మార్పించారు. అనంతరం కాలనీ అంతా వారిని ఊరేగించారు.

 Mentally challenged man, woman forced to marry for TikTok video

ఈ తతంగమంతా వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్నవారు కూడా వాళ్లను చూసి ఆగి.. తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్నారు. పాపం ఏం జరుగుతుందో తెలియక ఆ మానసిక వికలాంగులు ఇద్దరు సెల్‌ఫోన్‌ కెమెరాల వైపు నవ్వుతూ చూస్తుండిపోయారు.

స్థానికంగా ఉన్న గోపాల్ బజార్‌లోని బహనాగ బ్లాక్‌లో ఉన్న స్వీట్ స్టాల్‌లో ఆ మానసిక వికలాంగుడు పనిచేస్తాడని సమాచారం. ఇక ఆ మహిళ అదే ప్రాంతంలో రోజూ వీధుల్లో సంచరిస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి టిక్‌టాక్ వీడియో బాలాసోర్ ఎస్పీ జుగల్ కిశోర్ బానోత్ మాట్లాడుతూ.. దానిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అసలు అలాంటి ఘటన జరిగినట్టే తమ దృష్టికి రాలేదన్నారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ మాత్రం మానసిక వికలాంగుల పట్ల ఆ కాలనీ వాసులు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు.

English summary
forcible marriage to mentally challenged and disabled man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X