వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇవ్వండి : కారణమిదేనా ?

|
Google Oneindia TeluguNews

పుణే : శరీరంలో అవయవాలు చచ్చుబడి ... కదలలేని స్థితిలో అచేతనంగా ఉన్న వారు మాత్రమే కారుణ్య మరణానికి దరఖాస్తు చేస్తారు. కానీ మహారాష్ట్రలో ఓ వ్యక్తి మాత్ర విచిత్రంగా మెర్సీ కిల్లింగ్ కోసం పర్మిషన్ ఇవ్వాలని కోరాడు. తనకు పెళ్లి కావడం లేదని .. అందుకోసమే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరడం కలకలం రేపుతోంది.

కెరీర్ .. పెళ్లి ...

కెరీర్ .. పెళ్లి ...

కెరీర్‌లో స్థిరత్వం లేకపోవడం, పెళ్లి కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో సీఎంకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని మహారాష్ట్ర అధికారులు కూడా ధ్రువీకరించారు. ఆ వ్యక్తి మనోవేదనకు కారణం .. పెళ్లి కాకపోవడమేనని వారు కూడా తెలిపారు. తమ కార్యాలయానికి 20 రోజుల క్రితం లేఖ వచ్చిందని చెప్పారు. ఓ 35 ఏళ్ల వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లికి 70 ఏళ్లు, తండ్రికి 83 ఏళ్ల వయస్సు ఉంటుంది. పేరెంట్స్ కు ఏం చేయలేకపోతున్నామనే బాధ అతనిలో కనిపించిందని చెప్పారు.

ఏం చేయలేకపోతున్నామనే బాధ

ఏం చేయలేకపోతున్నామనే బాధ

సదరు వ్యక్తి పేరెంట్స్ పై వల్లమాలిన అభిమానం ఉందని లేఖను బట్టి చూస్తే అర్థమవుతోంది. అయితే తనకు 35 ఏళ్లు వచ్చిన ఏ రంగంలో పురోగతి సాధించని స్థాయిలో ఉన్నానని మదనపడుతున్నారు. దీనికితోడు అతనిని పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురాకపోవడంతో కలచివేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరికి మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారని తెలిపారు. అయితే అతనిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని అధికారులు తెలిపారు.

బ్యాక్ గ్రౌండ్ బాగుందే ...

బ్యాక్ గ్రౌండ్ బాగుందే ...

లేఖ రాసిన వ్యక్తి గురించి పోలీసులు పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. అతను మంచి విద్యావంతుడని పేర్కొన్నారు. కానీ చదువుకు తగిన ఉద్యోగం లభించలేదన్నారు. దీంతో ఉన్నతస్థానానికి ఎప్పుడూ చేరతానోనన్న అభిలాషతో అతనిలో ఉంది. అంతేకాదు ఆయన మంచి ఉన్నత కుటుంబానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కోసం పడిన ఆరాటానికి ఫలితం లభించకపోవడంతో ... నిర్ణయానికి కారణమైందని వివరించారు. చివరి ఆప్షన్ గా మెర్సి కిల్లింగ్ కోసం లేఖ రాశాడని ... ఇప్పటికే అయతే కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

English summary
A man in Maharashtra asked to give permission for the killing of Mercy. It is not for her to be married, but for the sake of compassionate death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X