వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ విమానాశ్రయాల వెబ్‌సైట్లు హ్యాక్: పాక్ హ్యాకర్ల పనే!

కొచ్చిన్, తిరువనంతపురం విమానాశ్రయాల వెబ్‌సైట్‌లు హాక్‌కు గురయ్యాయి. పాకిస్థాన్ సైబర్ అటాకర్స్ గ్రూప్ ఈ హ్యాకింగ్ పాల్పడ్డారు.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కొచ్చిన్, తిరువనంతపురం విమానాశ్రయాల వెబ్‌సైట్‌లు హాక్‌కు గురయ్యాయి. పాకిస్థాన్ సైబర్ అటాకర్స్ గ్రూప్ పేరిట ఈ హ్యాకింగ్ పాల్పడ్డారు. 'we are unbeatable.. mess with the best die like the rest' అనే సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.

అంతేగాక, ఈ వెబ్‌సైట్లు 'కాశ్మీరీ చీతా'చే హ్యాకింగ్ చేయబడ్డాయని పేర్కొన్నారు హ్యాకర్లు. హ్యాకింగ్ విషయం బుధవారం వెలుగులోకి వచ్చిన వెంటనే దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నారు.

Mess with best, die like the rest, hackers say on Cochin, Trivandrum airport websites

హ్యాకింగ్ వెనక ఎవరున్నారనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. కేరళ వన్ఇండియాకు తెలిపారు. www.cochinairport.com and trivandrumairport.com ఈ రెండు వెబ్ సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి.

కాగా, ఈ వెబ్‌సైట్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు అధికారులు. విమానాల రాకపోకలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ వెబ్‌సైట్లలో ఉన్నందున దీన్ని కొంత ఆందోళన చెందే అంశంగా అధికారులు భావిస్తున్నారు. హ్యాకింగ్ చేసిన వాళ్లు స్థానికులు కాదని సైబర్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. కేరళ బయటి నుంచే ఈ హ్యాకింగ్ జరిగిందని చెప్పారు. మొదట వెబ్‌సైట్లను పునరుద్ధరించిన అనంతరం హ్యాకర్ల పనిపడతామని అధికారులు తెలిపారు.

English summary
The websites of the Cochin and Thiruvananthapuram airports have been hacked. Mess with the Best read a message from a group called the Pakistan Cyber Attackers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X