వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాందేవ్ ‘కింభో’ ప్రమాదకరమా?: గూగుల్ ప్లే‌స్టోర్ నుంచి ఔట్! ఎందుకు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ పోటీగా యోగా గురు బాబా రాందేవ్ ఆవిష్కరించిన స్వదేశీ కింభో యాప్‌ను అప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేశారు. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకు అది సాధ్యం కాలేదు. అయితే ఐఫోన్స్, ఐప్యాడ్స్‌లకు మాత్రం యాప్ స్టోర్‌లో ఈ యాప్ కొంత సమయంపాటు అందుబాటులో ఉంది.

వాట్సప్‌కు షాక్: రాందేవ్ 'కింభో' మెసేజింగ్ యాప్, జియోకి పోటీగా పతంజలి సిమ్ ప్లాన్స్వాట్సప్‌కు షాక్: రాందేవ్ 'కింభో' మెసేజింగ్ యాప్, జియోకి పోటీగా పతంజలి సిమ్ ప్లాన్స్

కింభో అనేది సంస్కృతం పదం. దీని అర్థం 'మీరెలా ఉన్నారు' అని. ఈ యాప్ ఎందుకు మాయమైందన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదు. కేవలం స్వదేశీ నినాదంతో బాబా రాందేవ్ ప్రతి రంగంలోనూ అడుగుపెట్టి విజయం సాధిస్తున్నారు. పతంజలి ఉత్పత్తులతో దూసుకెళ్తున్నారు. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పతంజలి సిమ్ కార్డులను కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ప్రమాదకరం? బగ్స్

ప్రమాదకరం? బగ్స్

కాగా, కింభో యాప్‌లో కొన్ని లోపాలున్నాయని, అందుకే ఈ యాప్‌ను వెంటనే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ కంపెనీ కూడా తన ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను తొలగించినట్లు తెలిసింది. కేవలం గూగుల్‌ ప్లే స్టోర్‌ సెర్చ్‌లో మాత్రమే కాక, కింభో పేజీ యాప్‌లో కూడా ఇది ఓపెన్‌ కావడం లేదు. దానిలోకి లింక్స్‌ను క్లిక్‌ చేస్తే, ఎర్రర్‌ చూపిస్తోంది. అయితే ఎందుకు కింభో యాప్‌ను గూగుల్‌, ఆపిల్‌లు తమ సంబంధిత స్టోర్లలో డిలీట్‌ చేశాయో స్పష్టమైన కారణం తెలియడం లేదు. కానీ డెవలపర్లు మాత్రం ఈ యాప్‌ ప్రమాదకరమని, బగ్స్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

 పాకిస్థానీ ఫొటో ఏంటీ?

పాకిస్థానీ ఫొటో ఏంటీ?

కాగా, ఒక ట్విట్టర్‌ యూజర్‌, కింభో యాప్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లను కూడా షేర్‌ చేశాడు. దానిలో స్వదేశీ యాప్‌, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్‌ కూడా వాడుతుందని తెలిపాడు. భారతీయుల కోసం భారతీయులు రూపొందించిన ఈ స్వదేశీ యాప్‌లో పాకిస్తానీ నటి ఫోటో కనిపించడం ఏమిటి? అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు.

సెక్యూరిటీ రీసెర్చర్ ఏమన్నారంటే..

సెక్యూరిటీ రీసెర్చర్ ఏమన్నారంటే..

అంతేకాక ఆధార్‌ సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలున్నాయనిద ఫ్రెంచ్‌ సెక్యురిటీ రీసెర్చర్‌ ఇలియట్‌ ఆండర్సన్‌ పేర్కొన్నారు. ఈ యాప్‌ చాలా బగ్స్‌తో కూడుకుని ఉందని, యూజర్లు ఈ యాప్‌ వాడుతూ పంపించుకున్న మెసేజ్‌లన్నీ తాను యాక్సస్‌ చేయగలుగుతున్నానని తెలిపారు. పతంజలి కమ్యూనికేషన్స్‌ కూడా ఈ బగ్స్‌ను ఫిక్స్‌ చేయడంతోనే కింభో యాప్‌ను డిలీట్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఈ యాప్‌ మొత్తం ఒక జోక్‌గా అభివర్ణించారు.

కాపీ పేస్టేనా?

కాపీ పేస్టేనా?

కింభో యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా ఉంటేనే మేలని ఇలియట్‌ ట్వీట్‌ చేశారు. ఇది బోలో మెసెంజర్‌ను కాపీ చేసిందనే ఆరోపణలతో కూడా కింభోను ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డిలీట్‌ చేసినట్టు తెలుస్తోంది. కింభో యాప్‌ మరో అప్లికేషన్‌ కాపీ పేస్టని, వీటి స్క్రీన్‌షాట్లు, వివరాలు అన్నీ సమానంగా ఉన్నాయి అని ఇలియట్‌తో పాటు మరో ట్విట్టర్‌ యూజర్‌ కూడా వెల్లడించాడు.

English summary
Day after Yoga guru Ramdev's Patanjali launched a messaging application, "Kimbho", pitching it as a challenge to popular messaging app WhatsApp, users are no longer able to find it on Google Play Store. The app, which was launched on Wednesday, is still seen on iOS App Store and the real time messaging app is still accessible by those who downloaded it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X