వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మి టు' ఆరోపణలపై తర్వాత మాట్లాడుతా: ఎంజే అక్బర్ రాజీనామా చేశారా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'మి టూ' ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఆదివారం నాడు మెయిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారని చెబుతున్నారు. అయితే, ఆయన ఇంకా రాజీనామా చేయలేదని మరో వాదన వినిపిస్తోంది. ప్రధాని ఆయన వాదన విన్నాక నిర్ణయం ఉంటుందని అంటున్నారు.

అంతకుముందు, అక్బర్‌ నేడు తన విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు ఆరోపణలపై ప్రశ్నించారు. ఆయనను చుట్టుముట్టిన జర్నలిస్టులు... అరోపణలపై స్పందించాలని అడగ్గా.. తనపై వచ్చిన విషయంపై తాను తర్వాత మాట్లాడతానని అన్నారు.

భారత్‌కు ఎంజే అక్బర్: ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని మోడీభారత్‌కు ఎంజే అక్బర్: ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రధాని మోడీ

MeToo: Amid reports of MJ Akbar quitting, govt clarifies no resignation yet, he is still in office

'దీనిపై నేను తర్వాత ప్రకటన విడుదల చేస్తాను' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, అక్బర్‌పై చర్యలు తీసుకునేందుకు బీజేపీ కూడా సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో దీనిపై స్పందించాలంటూ ప్రధాని మోడీ, ఇతర మంత్రివర్గ సహచరులకు ప్రశ్నలు ఎదురవుతుండటంతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఎంజే అక్బర్‌ సంపాదకునిగా ఉన్నప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు మహిళా పాత్రికేయులు 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొందరు విదేశీ మహిళా పాత్రికేయులు కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

English summary
Suspense over MJ Akbar's position in the government continued on Sunday after reports suggested that the Minister of State for External Affairs, who is facing several MeToo allegations, had quit his post by emailing his resignation to the Prime Minister's Office. However, the government has clarified that there was no resignation yet and that the journalist turned politician continued to remain in office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X