చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే..సినిమాలు, సీరియళ్లు, పాటలు..అన్నీ ఉచితం

|
Google Oneindia TeluguNews

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండటానికి ఉచితంగా సినిమాలు, పాటలు..చివరికి టీవీ సీరియళ్లను కూడా ఉచితంగా చూసే వెసలుబాటు లభించింది. దీనికోసం అధికారులు ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఉచితంగా సినిమాలను చూసేయొచ్చు. ఈ ఫెసిలిటీని కల్పించబోతున్నది మన హైదరాబాద్ మెట్రో రైలులో కాదు.. చెన్నైలో. చెన్నై మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రాబోతున్నారు. దీనికోసం వారు ఓ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ వచ్చేనెల చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచనున్నారు.

మెట్రో రైల్వేస్టేషన్ పరిధిలో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు. దీని సేవలు కూడా వచ్చేనెల చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే ఆరంభం అవుతంది. ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకున్న యాప్ ను వైఫైకి అనుసంధానిస్తే చాలు. మనకు ఇష్టమైన సినిమాలు ఉచితంగా స్ట్రీమ్ అవుతాయి. మెట్రో రైలులోనూ నిరాంటకంగా సినిమాలను చూసేయొచ్చు. మెట్రో కారిడార్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లు, అన్ని రైళ్లలోనూ ఈ వసతిని కల్పించినట్లు చెన్నై మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో మూడు మార్గాల్లో మొత్తం 52 మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ మూడు కారిడార్లు, అన్ని మెట్రో రైళ్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Metro launches app to stream free movies, songs, TV serials ..

చెన్నై మెట్రో రైలు యాప్ లో ప్రస్తుతానికి నాలుగు భాషల్లో వినోదాత్మక కార్యక్రమాలను చూసుకోవచ్చు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఆయా కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. క్రమంగా అన్ని భాషల్లోనూ ఆయా కార్యక్రమాలను తిలకించేలా యాప్ ను అప్ డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. మెట్రో కారిడార్లు, స్టేషన్లు, రైళ్లల్లో వైర్ లెస్ నెట్ వర్క్ ను కల్పించడానికి ఇదివరకే తాము టెండర్లను ఆహ్వానించామని, ప్రస్తుతం అవి తుదిదశలో ఉన్నాయని చెప్పారు. టెండర్లు ఖరారైన వెంటనే నెలరోజుల్లో వైఫై అందుబాటులోకి వస్తుందని వివరించారు.

English summary
Chennai metro rail patrons will have access to a range of free movies, music and TV soaps, thanks to a mobile entertainment system launched by CMRL. Come March, commuters will be able to install the app on their phones and watch shows, movies and and listen to music while riding to their location. A metro rail official said that CMRL would be the first metro rail service in the country to have this entertainment system inside the trains. Adding that trials of the app were being conducted on three trains, he said that they would be launching between the end of March and early April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X