• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పట్టాలెక్కిన మెట్రో రైళ్లు: భౌతిక దూారాన్ని ఎలా పాటించాలంటే?: ముందు జాగ్రత్త చర్యలు ఇలా

|

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. దేశ రాజధానిలో కొద్దిసేపటి కిందటే రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు మెట్రో రైలు సర్వీసులు పరుగులు మొదలు పెట్టాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రకటివంచిన లాక్‌డౌన్ తరువాత.. మెట్రో రైళ్లు పునరుద్ధరణకు నోచుకోవడం ఇదే తొలిసారి. సుమారు 169 రోజుల తరువాత అవి అందుబాటులోకి వచ్చాయి.

  Metro Rail Services Resume @Hyderabad నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు!!
  169 రోజుల తరువాత..

  169 రోజుల తరువాత..

  అన్‌లాక్-4లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడం ఒకింత భయాందోళనలకు గురి చేస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.. భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడానికి అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

  పొరపాట్లకు నో ఛాన్స్..

  పొరపాట్లకు నో ఛాన్స్..

  కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మెట్రో రైలు అధికారులు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోవడానికీ అవకాశం ఇవ్వట్లేదు. భౌతిక దూరాన్ని పాటించేలా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. మెట్రో స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా అదే రీతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకరిని మరొకరు ఏ మాత్రం తాకే అవకాశం ఇవ్వకుండా భద్రత చర్యలు చేపట్టారు. సాధారణంగా మెట్రో రైళ్లు క్రిక్కిరిసిపోతుంటాయి. ర్యాకుల్లో ఆ పరిస్థితి తలెత్తనివ్వట్లేదని ఢిల్లీ మెట్రో రైళ్లే అధికారులు వెల్లడించారు.

  ఢిల్లీలో ఎల్లో లైన్ ఒక్కటే..

  ఢిల్లీలో ఎల్లో లైన్ ఒక్కటే..

  దేశ రాజధాని ప్రజా రవాణా మెట్రో రైళ్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఢిల్లీవాసులు లైఫ్‌లైన్‌గా దీన్ని భావిస్తారు. అన్‌లాక్-4లో భాగంగా మెట్రో రైళ్లు పట్టాలు ఎక్కాయి. సోమ, మంగళవారాల్లో ఎల్లో లైన్‌లో మాత్రమే రైళ్లను నడిపిస్తున్నారు అధికారులు. 49 కిలోమీటర్ల పొడవుండే ఈ ఎల్లో లైన్ పరిధిలో 37 స్టేషన్లు, 20 అండర్ గ్రౌండ్, 17 ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే రైళ్లు అందుబాటులో ఉంటాయి.

  ప్రతి ర్యాకులో భౌతిక దూరం

  ప్రతి ర్యాకులో భౌతిక దూరం

  మెట్రో స్టేషన్ ముఖ ద్వారాలను మొదలుకుని..ప్లాట్ ఫామ్‌ల దాకా మార్కింగ్‌లను వేశారు. దానికి అనుగుణంగా ప్రయాణికులు లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. డిజిటల్ పద్ధతిన టికెట్లను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. స్టేషన్ కౌంటర్లలో టోకెన్లు అందుబాటులో ఉండవు. స్మార్ట్ కార్డుల ద్వారానే ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది. అల్ట్రా వయోలెట్ విధానంలో శానిటైజర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ర్యాక్‌లో భౌతిక దూరాన్ని పాటించడానికి మార్కింగ్‌లను వేశారు. ప్రతి మార్కింగ్ మధ్య దూరం రెండుమీటర్ల వరకు ఉంటుంది.

  పరిస్థితులకు అనుగుణంగా..

  పరిస్థితులకు అనుగుణంగా..

  పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైళ్ల సమయాన్ని పెంచుతారు. అలాగే- మిగిలిన లైన్లలో కూడా సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాళ్ తెలిపారు. ఈ వారంలోనే మిగిలిన లైన్లలోనూ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాల్సి ఉంటుందని, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. టెంపరేచర్ అధికంగా ఉండే వారి ప్రయాణానికి అనుమతి ఇవ్వమని అన్నారు.

  English summary
  Delhi Metro Rail Corporation will resume services from 7 am today on Yellow and Rapid Metro lines; visuals from Huda City Centre metro station in Gurugram.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X