వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుక్రవారం ఉదయమే బులెటిన్, లైఫ్ సపోర్ట్‌పై బాలు, ఆరాతీసిన ఉప రాష్ట్రపతి

|
Google Oneindia TeluguNews

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం బులెటిన్‌లో విషమంగా ఆరోగ్యంగా ఉందని తెలుపడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వాస్తవానికి రాత్రి 12 గంటలకు మరో బులెటిన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వలేదు. దీంతో శుక్రవారం ఉదయం బులెటిన్ ఇవ్వొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 mgm hospital to be released another bulletin friday

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని 10 మంది వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయనను లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ఎస్పీ బాలు ఆరోగ్యం కుదుటపడాలని ఆయన అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఎస్పీ బాలు కరోనా బారిన పడి ఆగస్టు 5న ఎంజీఎంలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా నయమైనా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ మాత్రం తగ్గలేదని వైద్యులు తెలిపారు.

Recommended Video

SP Balasubrahmanyam Health Condition Is Extremely Critical - MGM Hospital | Oneindia Telugu

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరాతీశారు. ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో వైద్యులతో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాలు ఆరోగ్యం కాస్త క్రిటికల్ గానే ఉంది అని వైద్యులు తెలిపినట్టు సమాచారం. అయితే అవసరమైతే ఇతర వైద్యుల సాయం కూడా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు.

English summary
mgm hospital to be released another bulletin friday morning for sp balasubramanyam health condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X