వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ఐఏ చేతికి కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: శుక్రవారం నుంచి దర్యాప్తు, పినరయి లేఖతో విచారణ..

|
Google Oneindia TeluguNews

దేశాన్ని కుదిపేస్తోన్న కేరళ బంగారం స్మగ్లింగ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 30 కేజీల బంగారం స్మగ్లింగ్ వెనక స్వప్ప సురేశ్ ఉన్నారని వెలుగులోకి రావడం, కేరళ ఐటీ శాఖలో కొలువు నేపథ్యంలో.. సీఎం పినరయి విజయన్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేశాయి. బంగారం స్మగ్లింగ్‌పై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించాలని నిన్న (బుధవారం) ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీంతో కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది.

బంగారం అక్రమ రవాణా అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంది అని భావించింది. దీంతో కేసు విచారణకు ఎన్ఐఏకు అప్పగించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం చేపట్టబోయే అవకాశం ఉంది. స్వప్ప సురేశ్‌కు ఐటీ శాఖలో కొలువు ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్‌ను పదవీ నుంచి తప్పించారు. కానీ సీఎంవోకు తెలిసే స్మగ్లింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపించారు. పినరయి విజయన్ రాజీనామాకు పట్టుబడ్డాయి.

MHA hands over Kerala gold smuggling case to NIA..

Recommended Video

Unlock 1.0: Guidelines for Reopening of Shopping malls, Hotels and Religious Places

బంగారం స్మగ్లింగ్ కేసులో మాజీ యూఏఈ కాన్సులేట్ పీఆర్ఎ శరిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వప్ప సురేశ్ పరారీలో ఉండగా.. ఆమెను కేరళ సీఎం కాపాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించారు. విపక్ష కాంగ్రెస్ నేత రమేశ్ మాత్రం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించింది.

English summary
Ministry of Home Affairs handed over the probe into Thiruvananthapuram airport gold smuggling case to the National Investigation Agency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X