వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ డిజైనర్ 'బిభు' డ్రెస్‌లో మిచెల్లీ మిలమిల, సిరిసిల్ల చీర రెడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ఆదివారం ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ పర్యటనలో మిచెల్ ఒబామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

న్యూయార్క్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించారు. జియోమెట్రిక్ - ప్రింట్ బ్లాక్, తెలుపు, నీలం రంగు కలయికతో... ఆకట్టుకునే విధంగా ఈ దుస్తులను రూపొందించారు. సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంలో బిభు మహాపాత్ర పేరుగా గాంచారు.

కాగా, అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామాకు తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టు చీరను బహుమతిగా ఇస్తున్న విషయం తెలిసిందే. మిచెల్లీ కోసం చీరను, అధ్యక్షుడు ఒబామా కోసం శాలువాను సిద్ధం చేశాడు సిరిసిల్లవాసి. వాటిని రెండు అగ్గిపెట్టెలో సర్దాడు.

రిపబ్లిక్‌ డే రోజున వారికి ఇవ్వనున్నారు. వాటిని తయారు చేసిన వ్యక్తి విజయ్‌. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన విజయ్‌.. ప్రముఖ వస్త్ర శాస్త్రవేత్త నల్ల పరంధాములు కుమారుడు. మరమగ్గంపై రాత్రింబవళ్లు శ్రమించి 60 గ్రాములతో నాలుగున్నర మీటర్ల చీరను, 30 గ్రాములతో రెండు మీటర్ల శాలువాను తయారు చేశాడు. హైదరాబాద్‌లో శనివారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి తాను తయారుచేసిన కానుకలను చూపించారు.

మిచెల్లీ ఒబామా

మిచెల్లీ ఒబామా

న్యూయార్క్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించారు. జియోమెట్రిక్ - ప్రింట్ బ్లాక్, తెలుపు, నీలం రంగు కలయికతో... ఆకట్టుకునే విధంగా ఈ దుస్తులను రూపొందించారు. సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంలో బిభు మహాపాత్ర పేరుగా గాంచారు.

మిచెల్లీ ఒబామా

మిచెల్లీ ఒబామా

అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ఆదివారం ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే.

మిచెల్లీ ఒబామా

మిచెల్లీ ఒబామా

ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ పర్యటనలో మిచెల్ ఒబామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మిచెల్లీ ఒబామా

మిచెల్లీ ఒబామా

న్యూయార్క్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించారు. జియోమెట్రిక్ - ప్రింట్ బ్లాక్, తెలుపు, నీలం రంగు కలయికతో... ఆకట్టుకునే విధంగా ఈ దుస్తులను రూపొందించారు.

సిరిసిల్ల చీర

సిరిసిల్ల చీర

అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామాకు తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టు చీరను బహుమతిగా ఇస్తున్న విషయం తెలిసిందే. మిచెల్లీ కోసం చీరను, అధ్యక్షుడు ఒబామా కోసం శాలువాను సిద్ధం చేశాడు సిరిసిల్లవాసి.

English summary
The dress Michelle Obama sported as she emerged from Air Force One with husband Barack Obama in New Delhi on Sunday had an Indian connection - the designer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X