వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదురెదురుగా వచ్చిన ఇండిగో, బీఎస్ఎఫ్ విమానాలు... త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఆ కాసేపూ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం, బీఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో ఎద

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆ కాసేపు టెన్షన్.. టెన్షన్! రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ. మొత్తానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. వివరాల్లోకి వెళ్తే....

ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి వస్తోంది. అదే సమయంలో, అదే మార్గంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్‌) కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా వస్తోంది.

Mid-air collision between IndiGo flight, BSF aircraft averted, DGCA initiates probe

బీఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెరిషీ కూడా ఉన్నారు. ఇండిగో విమానం 26 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. 25 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న బీఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నట్లుండి మరింతపైకి రావడం ప్రారంభించింది.

క్షణాల్లోనే రెండు విమానాలు కనుచూపు దూరంలోకి వచ్చేశాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ ఏటీసీని సంప్రదించాడు. వెంటనే బీఎస్ఎఫ్ విమానానికి ప్రమాద సంకేతం పంపారు. దీంతో ఆ విమాన పైలట్ కూడా అప్రమత్తమయ్యాయి.

అయినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. రెండు విమానాలు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. వెంట్రుక వాసిలో ఆ విధంగా రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. దీనిని ఇండిగో అధికార ప్రతినిధులు కూడా ధ్రువీకరించారు. ప్రయాణికులంతా బతుకు జీవుడా అని నిట్టూర్చారు.

English summary
Civil aviation regulator DGCA on Friday initiated a probe into a near-miss between an IndiGo flight and an aircraft operated by a government agency at a height of 26,000 feet over Jammu and Kashmir.The central government owned aircraft is believed to be from BSF's fleet. Union Home Secretary Rajiv Mehrishi was reported to be travelling on board the BSF aircraft. However, this could not be independently verified. The budget passenger carrier IndiGo in a statement said that its alert pilot and a state-of-the-art anti-collision system -TCAS-RA- installed on its aircraft helped avert the mid-air collision at a height of 26,000 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X