వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగ్-21.. చాలా పవర్ ఫుల్ గురూ: షష్ఠి పూర్తి వయస్సులోనూ శతృవు కుదేల్

|
Google Oneindia TeluguNews

భారత వైమానిక దళంలో ఆ యుద్ధ విమానం వయస్సు సుమారు 58 సంవత్సరాలు. మరో రెండేళ్లు గడిస్తే, షష్ఠిపూర్తి చేసుకునే వయస్సు ఆ యుద్ధవిమానానిది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రతిష్ఠాత్మక హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. 1961లో తొలిసారిగా భారత వైమానిక దళంలో చేరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ యుద్ధవిమానం కూడా అప్ డేట్ అయ్యింది. అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా రూపాంతరం చెందింది. అదే మిగ్-21 బైసన్ యుద్ధ విమానం.

మిగ్ 21 దెబ్బకు నేలకు కరచుకున్న ఎఫ్-16 పాక్ ఎయిర్ క్రాఫ్ట్ తో పోల్చుకుంటే.. దాని సత్తా తక్కువే. అయినప్పటికీ.. శతృవు కంటపడగానే కనికరం చూపలేదు. వెంటాడి, వేటాడి నేలకూల్చింది. మిగ్ పూర్తి పేరు.. మికోయన్-గురేవిచ్. మొదట్లో రష్యా సంయుక్త రాష్ట్రాలు దీన్ని డిజైన్ చేశాయి. దీనికి లోబడి హెచ్ఏఎల్ తీర్చిదిద్దింది. మిగ్-21 ఎఫ్ ఎల్, మిగ్-21ఎం, మిగ్-21 బైసన్ రకాలు ప్రస్తుతం వైమానిక దళంలో ఉన్నాయి.

24 విమానాలతో భారత భూభాగంలోకి పాకిస్తాన్, అడ్డుకున్న 8 భారత విమానాలు24 విమానాలతో భారత భూభాగంలోకి పాకిస్తాన్, అడ్డుకున్న 8 భారత విమానాలు

MiG-21 Bison: The Indian Air Force Fighter Jet That Took Down Pakistan’s F-16 Fighting Falcon

1961 తరువాత క్రమంగా.. దాని సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం వైమానిక దళంలో 657 మిగ్-21 యుద్ధ విమానాలు ఉన్నాయి. మిగ్ ల సత్తా ఏపాటిదో పాకిస్తాన్ కు బాగా తెలుసు. ఇప్పటికి మూడుసార్లు దాని దెబ్బను రుచి చూసింది పాక్ వైమానిక దళం. 1965 నాటి యుద్ధంలో శతృదేశానికి అధునాతన ఎఫ్‌-104 స్టార్‌ఫైటర్లను వరుసగా నేలకూల్చింది. అదే పరిస్థితి 1971 యుద్ధంలోనూ తలెత్తింది. పాక్‌కు చెందిన తొమ్మిది యుద్ధవిమానాలను నేలకూల్చాయి. దాని తరువాత 1999లో సంభవించిన కార్గిల్‌ యుద్ధంలోనూ వాయుసేన మిగ్ లను భారీగా వినియోగంలోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో పహారా కాసింది ఈ యుద్ధవిమానం.

MiG-21 Bison: The Indian Air Force Fighter Jet That Took Down Pakistan’s F-16 Fighting Falcon

కాలానుగుణంగా ఆధునిక సౌకర్యాలను కల్పించలేకపోవడంతో క్రమంగా అవి ప్రమాదాల బారిన పడుతూ వచ్చాయి. దీనితో రక్షణశాఖ దీన్ని ఆధునికీకరించింది. వందకు పైగా మిగ్‌-21 జెట్‌లను 'బైసన్‌' రకంగా మార్పు చేసింది. ఆధునిక వ్యవస్థలను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చింది రక్షణశాఖ మల్టీమోడ్‌ రాడార్‌ సహా మెరుగైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటుచేసింది. 'ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌ మెజర్స్‌' వంటివీ ఇందులో ఉన్నాయి. శతృవుల యుద్ధవిమానాలను నేలకూల్చడానికి అవసరమైన ఆర్‌-73, ఆర్‌-77 క్షిపణులను మోసుకెళ్లే స్థాయికి దీన్ని అప్ డేట్ చేశారు. ప్రత్యర్థులు ఎంత దూరం నుంచి దాడి చేయగలదని ముందే అంచనా వేసే సామర్థ్యం దీనికి ఉంది.

English summary
In 1961, IAF opted for the Mikoyan-Gurevich Design Bureau made MiG-21 and since then has made 657 of these fighter jets, including three variants - MiG-21FL, MiG-21M and MiG-21 Bison. While India was one of the largest operators of MiG-21s outside USSR, India is currently the largest operator of MiG-21 Bison, with an estimated 100+ aircrafts on duty. However, the Bison are currently being used only as an Interceptor, the same as they did yesterday with the Pakistan’s F-16 and intercepted them. The MiG-21 played a pivotal role in the 1971 India-Pakistan War, and they will soon be replaced by the indigenously made Tejas LCA by HAL. The MiG-21 has a notorious history of crashing due to technical snags and as per an estimate, more than 500 planes have been lost to various crashes all across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X