వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ లో కూలిపోయిన మిగ్ -21 ఫైటర్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిగ్ - 21 కూలిపోయింది. శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం కూలిపోయిందని భారత వైమానిక అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఈ విమానం కూలిపోయింది.

సాధారణ శిక్షణలో భాగంగా శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి యుద్ధ విమానం బయలుదేరింది. అయితే కొద్ది సేపటికి బడ్గావ్ జిల్లాలోని సోయిబుగ్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. అయితే పైలెట్ సురక్షితంగా తప్పించుకున్నాడు.

 A MiG-21 fighter jet of the Indian Air Force crashed in Jammu and Kashmir

విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పైలెట్ ను సురక్షితంగా ఆర్మీ హెలికాప్టర్ ద్వారా బేస్ క్యాంపస్ కు తీసుకొచ్చామని ఆర్మీ అధికారులు తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ -21 యుద్ధ విమానాలు 40 ఏళ్లుగా భారత వైమానిక దళంలో కొనసాగుతున్నాయి.

అయితే ఇప్పటికే పలు ప్రమాదాలలో పలు మిగ్ -21 విమానాలు కుప్ప కూలిపోయాయి. శ్రీనగర్ లో విమానం కూలిపోవడానికి గల కారణాలపై ఆర్మీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

English summary
A MiG-21 fighter jet of the Indian Air Force crashed in the fields in the Budgam district of Jammu and Kashmir, with the pilot managing to eject safely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X