వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సులోనే కవలలకు జన్మనిచ్చిన వలస కూలీ.. పుట్టిన కాసేపటికే శిశువులు మృతి...

|
Google Oneindia TeluguNews

ఆరు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళా వలస కూలీ బస్సులోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకుండానే ప్రసవం జరగడంతో.. జన్మించిన గంటకే ఆ శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళను ఫాతిమాగా గుర్తించారు.

తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు... ఒకరు మృతి.. తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు... ఒకరు మృతి..

ఏం జరిగింది..

ఏం జరిగింది..

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాకు చెందిన ఫాతిమా బి(24),ఆమె భర్త మిథున్ మియాన్(26)లు బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాకు వలసొచ్చారు. అక్కడే ఓ ఇటుక బట్టీలో ఇద్దరూ పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా బట్టీ మూతపడటంతో.. స్వస్థలాలకు తిరిగొచ్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆ దంపతులు,మరో 42 మంది కలిసి ఓ ప్రైవేట్ బస్సు మాట్లాడుకున్నారు. తమను బెంగాల్ చేర్చేందుకు అంతా కలిసి రూ.1.2లక్షలు చెల్లించారు. అయితే బస్సు ప్రయాణం మొదలైన తర్వాత మార్గమధ్యలోనే ఫాతిమాకు నొప్పులు వచ్చాయి. బస్సులోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో బరేలీ జిల్లాలోని బిత్రి చైన్‌పూర్‌ సమీపంలోని నేషనల్ హైవే 24పై డ్రైవర్ ఆ దంపతులను దించేశాడు. అక్కడినుంచి 108 అంబులెన్సు ద్వారా వారు బరేలీ జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు.

వైద్యులు ఏం చెప్పారు..

వైద్యులు ఏం చెప్పారు..

ఫాతిమాకు చికిత్స అందించిన వైద్యురాలు వర్ష అగర్వాల్ మాట్లాడుతూ.. 'ఫాతిమా బస్సులోనే కవలలకు జన్మనిచ్చింది. కానీ ఆసుపత్రికి వచ్చేసరికే ఆ శిశువులు మృతి చెందారు. ఆర్నెళ్లకే ఆమె ప్రసవించడంతో శిశువులు ఆరోగ్యంగా జన్మించలేదు. దీంతో పుట్టిన గంటకే చనిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ బిడ్డలను పోగొట్టుకున్నందుకు తీవ్రంగా కుమిలిపోతోంది. ఆమె వేరే జిల్లా నుంచి బస్సులో వచ్చినందునా.. ఆమె శాంపిల్స్‌ను కోవిడ్ 19 వైద్య పరీక్షల కోసం పంపించాం.' అని చెప్పారు.

Recommended Video

Watch Woman Gives Birth To Child On Street | బిడ్డకు జన్మనిచ్చే తల్లి భూమికి భారమా ?
గత వారం మరో మహిళ కూడా..

గత వారం మరో మహిళ కూడా..


గత శుక్రవారం(మే 22) మరో మహిళా వలస కూలీ(21) కూడా శ్రామిక్ రైల్లోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే కవలలు ఇద్దరూ మృతి చెందారు. ఆ మహిళను గాయత్రీ దేవిగా గుర్తించారు. ప్రసవించే నాటికి ఆమెకు 8 నెలలుగా గుర్తించారు. తన భర్త భయ్యా లాల్‌తో కలిసి ఆమె వారణాసి నుంచి గుజరాత్‌లోని వాపికి ప్రయాణిస్తుండగా ప్రసవం జరిగింది. నెలలు నిండకుండా ప్రసవించడం వల్లే శిశువులు మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు.

English summary
A six-month pregnant migrant woman delivered twin daughters while the bus in which she was travelling, was passing through the Bareilly district.Doctors said that the woman has been quarantined and her swab samples would be sent for the corona tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X