• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

lockdown:350 కి.మీ సైకిల్‌పై పయనం, మార్గమధ్యలోనే వలసకూలీ మృతి, 10 రోజుల్లో ముగ్గురు...

|

లాక్‌డౌన్ కంటిన్యూ అవడంతో పరిశ్రమలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో వలసకూలీల స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో కొందరు నడుచుకుంటూ, మరికొందరు సైకిళ్ల మీద వెళ్లిపోతున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ బయల్దేరిన వలసకూలీ ఒకరు మార్గమధ్యలోనే చనిపోయారు. అతనితో ఉన్న 9 మంది కూలీలు విషయాన్ని మీడియాకు తెలియజేశారు. 10 రోజుల్లో సరిహద్దులో చనిపోయన వారి సంఖ్య మూడుకి చేరింది.

  India Lockdown : Watch Migrant Labourers Returning Native on Foot From Delhi, UP & KA Across Country

  పాకిస్థాన్ స్పీకర్‌ను వదలని రక్కసి, అసద్ ఖైజర్‌కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...

  పని లేక..

  పని లేక..

  ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్‌కి చెందిన తబారక్ అన్సారీ ఉపాధి కోసం మహారాష్ట్రలో ఉంటున్నాడు. భీవండిలో గల పవర్ లూమ్‌లో పనిచేస్తున్నాడు. మహారాజ్ గంజ్‌కి చెందిన చాలా మంది అతనితో పనిచేసేవారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వారికి పని లేదు. దీంతో చేతిలో డబ్బులు కూడా లేవు. తినడానికి తిండి లేకపోవడంతో.. ఇక్కడ ఏం చేయాలని అనుకొన్నారు. మరో 9 మందితో కలిసి స్వగ్రామం వెళ్లిపోదామని రెండురోజుల క్రితం బయల్దేరారు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో.. సైకిళ్ల మీద తమ ప్రయాణం ప్రారంభించారు.

  350 కి.మీ ప్రయాణించి..

  350 కి.మీ ప్రయాణించి..

  అన్సారీ బృందం 350 కిలోమీటర్లు ప్రయాణించారు. మరి కొన్నిగంటల్లో ఇంటికి చేరుకుంటామనే లోపు.. అన్సారీ మధ్యప్రదేశ్‌లో గల బార్వానీ వద్ద అస్వస్థతకు గురయ్యాడు. సైకిల్ మీద నుంచి కింద పడిపోయాడు. వెంటనే అతనిని నీడలోకి తీసుకెళ్లి.. మొహంపై నీళ్లు చల్లిన లాభం లేకపోయింది. అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. అలసిపోయి, వడదెబ్బకు గురవడంతో డీ హైడ్రేషన్ వచ్చి చనిపోయాడని పోలీసులు తెలిపారు. కానీ పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయం వెలుగుచూస్తుందని పేర్కొన్నారు.

  మరో ఇద్దరు కూడా..

  మరో ఇద్దరు కూడా..

  గత 10 రోజుల్లో అన్సారీతో చనిపోయిన వారి సంఖ్య మూడుకి చేరింది. పని లేక సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేసిన మరొ ఇద్దరు కూడా చనిపోయారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బార్వానీలో రెండు ఘటనలు జరిగాయి. గత నెల 28వ తేదీన బలిరాం అనే వ్యక్తి చెక్ పోస్ట్ దాటుతుండగా అస్తమాతో బాధపడి చనిపోయాడు. గతనెల 21వ తేదీన యూపీలోని శ్రావస్తికి వెళ్తున్న వకీల్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. కాలినడకన వెళ్తుండగా అతను చనిపోయాడు. బుధవారం వెయ్యి మంది వలసకూలీలు సరిహద్దు దాటే ప్రయత్నం చేయగా యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు హైవేలను మూసివేశాయి. అనుమతి పత్రాలు ఉంటేనే అలో చేస్తామని స్పష్టంచేశారు.

  English summary
  migrant labourer Tabarak Ansari, going back to his home state Uttar Pradesh on a bicycle from Maharashtra, died mid-way in Madhya Pradesh's Barwani today
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X